YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ

పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ

హైదరాబాద్, ఆగస్టు 14

పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ  ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు  మొదటి త్రైమాసిక నిధులు రూ.308 కోట్ల విడుదల  పంచాయతీ లకు 85శాతం, మండలాలకు 10 శాతం, జెడ్పీ లకు 5శాతం పంపిణీ  హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి  సీఎం కేసిఆర్, మంత్రులు కె టీ ఆర్,ఎర్రబెల్లి కి ధన్యవాదాలు తెలిపిన వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి  ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి అనేక సార్లు సీఎం కేసిఆర్ , మున్సిపల్ మంత్రి కే టీ ఆర్, తాను చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది అన్నారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, సీఎం కేసిఆర్, కేటీఆర్  లకు మంత్రి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
15 వ ఆర్థిక సంఘం ఈ నిధుల కింద రాష్ట్రానికి ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరయ్యాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇందులో మొదటి త్రైమాసిక నిధులు రూ.308 కోట్ల విడుదల అయ్యాయని అన్నారు. ఈ నిధులను గ్రామ పంచాయతీ లకు 85శాతం, మండలాలకు 10 శాతం, జెడ్పీ లకు 5శాతం నిధులను పంపిణీ చేస్తారన్నారు. ఈ నిధులతో తాగునీటి సమస్యల నివారణ, వాన నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త, ప్లాస్టిక్ సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం, పారిశుధ్య నిర్వహణ, కంపోస్ట్ ఎరువుల తయారీ వంటి వాటికి వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
ఆర్థిక సంఘం నిధుల పట్ల సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి కి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్ ల సుధీర్ఘ నిరీక్షణకు సీఎం కేసిఆర్  ఆలోచన వల్ల తెరపడింది అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసిఆర్  కృషి వల్లే ఈ నిధుల విడుదల సాధ్యమైందన్నారు. ఈ నిధులతో స్థానిక సంస్థల పరిధిలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుగుతాయని అన్నారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు ఈ నిధులను వినియోగించాలని పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ల ప్రజా ప్రతినిధులకు పోచంపల్లి విజ్ఞప్తి చేశారు. ఈ నిధుల మంజూరీ, విడుదలకు కృషి చేసిన సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లకు ఎమ్మెల్సీ పోచంపల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Related Posts