YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కరీంనగర్ ఆగస్టు 14
స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో 240 మంది లబ్ది దారులకు 2,37,55,492 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ  నిరుపేదలకు సాయం చేయడం సంతోషంగా ఉంది.  పేదింటి పెళ్లిళ్లకు మేనమామగా సీఎం అండగా ఉంటున్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందని అన్నారు. తెలంగాణ రాక ముందు కూడా ప్రభుత్వాలు ఉండే. కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు. ఆనాడు ఉన్న పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు ఏం మాత్రం సారూప్యం లేదు. పేద కుటుంబాల్లో బిడ్డ పెండ్లి చేయడానికి ఎంతో కష్టం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అప్పుల పాలయ్యేవారు. కానీ తెలంగాణాలో అలాంటి ఇబ్బందులు ఉండవద్దని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కెసిఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి చదువు పూర్తయ్యే వరకు కూడా ఆ బిడ్డను తెలంగాణా ఆస్తిగా భావించి ప్రభుత్వం అండగా  ఉంటోంది. ఆడ బిడ్డల ఇళ్లలో ఆనందం తాండవించాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఏ సంక్షేమ పధకం ప్రవేశ పెట్టినా మహిళలకే అగ్ర తాంబూలం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్ ఉన్న అన్ని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను నాలుగైదు రోజుల్లో క్లియర్ చేస్తాం. ప్రస్తుతం 240 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్నాం. ఎవరూ చేయని సాయాన్ని అందిస్తున్న సీఎం కెసిఆర్ ను నిండు మనసుతో దీవించాలని మహిళలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల స్వరూప రాణి-హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Posts