అమరావతి ఆగష్టు 14
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్ను సీఎం వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు అయన అన్నారు. హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయన మాట్లాడారు.
నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్ స్వప్నారెడ్డి తదితరులు పాల్గోన్నారు.