YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎస్పీయం ఫ్యాక్టరీ గేట్ ముందు నిరసన

ఎస్పీయం ఫ్యాక్టరీ గేట్ ముందు  నిరసన

ఆసిఫాబాద్ 
కాగజ్ నగర్ ఎస్పీయం ఫ్యాక్టరీ గేట్ ముందు నల్ల మాస్కులతో 260 మంది పర్మినెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన కార్మికులు, అఖిలపక్షం నాయకులు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ "రెండు సంవత్సరాల క్రితం పున:ప్రారంభమైన సిర్పూర్ పేపర్ మిల్లు వలన స్థానికులకు కానీ, పాత కార్మికులకు కానీ, పట్టణానికి చెందిన నిరుద్యోగ యువతకు కానీ, ఉద్యోగస్తులకు ఎలాంటి లాభం చేకూరలేదు. 260 మంది శాశ్వత కార్మికులను 600 కాంట్రాక్ట్ కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి 2000 నుంచి 3000 మంది కార్మికులను విధుల్లోకి తీసుకొని వారికి పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తూ ఇక్కడి స్థానికులకు అన్యాయం చేశారు. కాబట్టి ఈ విధానాన్ని నిరసిస్తూ దశల వారీగా ఉద్యమాన్ని కార్మిక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా మలచడానికి అఖిల పక్షం నాయకులం అందరం సిద్దంగా ఉన్నాము. తప్పకుండా ఎస్పియం యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడాలని, పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వీరికి పాత బకాయిలను చెల్లించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎస్పియం యాజమాన్యం ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో భారీ రాయితీలు పొంది ఇక్కడి కార్మికులకు అన్యాయం చేయడం సమంజసం కాదని అఖిల పక్ష నాయకులు అన్నారు."
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మైనార్టీ జిల్లా అధ్యక్షులు యూనుస్ హుస్సేన్, నిరుద్యోగ జెఎసి జిల్లా కన్వీనర్ పొన్న రమేష్, మాజీ కౌన్సిలర్లు షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూసుఫ్ ఖాన్, ఇర్ఫాత్, జాడి దీపక్,సత్తిబాబు, అథిక్ మరియు అన్ని పార్టీల నాయకులు, అఖిల పక్ష నాయకులు మరియు కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts