YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ముందే రాబందులు

విశాఖలో ముందే రాబందులు

విశాఖపట్టణం, ఆగస్టు 15, 
రాజధాని అంటే ఒకపుడు అన్నీ ఉన్న నగరమని, అందరికీ అండ అని అర్ధం వినిపించేది. ఇపుడు మాత్రం రాజధాని అంటూ భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వ్యాపార సామ్రాజ్య విస్తరణలు ఇలా అనేకం ముందుకు వస్తున్నాయి. అమరావతి రాజధాని అనుభవంతో విశాఖవాసులు రాజధాని అంటే జడుసుకునే పరిస్థితి. తాతల నాటి నుంచి కాపురం ఉంటున్న నివాసాలు, పదిలంగా చూసుకుంటున్న భూములూ అన్నీ కలసి ఒక్క దెబ్బకు కబ్జా అవుతాయాని హడలిపోతున్నారు. దానికి తగినట్లుగా టీడీపీ నాయకులు సైతం విశాఖ కబ్జా అవుతోందని ఉన్నవీ లేనివీ కలిపి భయపెట్టేస్తూ వచ్చారు. ఇంతవరకూ దీనికి ఆధారాలు లేకపోవడంతో వైసీపీ కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ అదే పార్టీలో ఓ సీనియర్ నేత దందాకు పాల్పడడం, అతన్ని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో విశాఖలో దందాలు మొదలయ్యాయ అన్న అనుమానాలు ఇటు జనాల్లో, అటు వైసీపీలో కూడా కలుగుతున్నాయట.థవిశాఖలో పూర్వీకుల నుంచి వస్తున్న ఒక పెద్ద ఇల్లు, కొంత జాగా ఒక సంప్రదాయ కుటుంబీకులకు ఉంది. వారు ఉద్యోగార్ధం ఇతర రాష్ట్రాలో ఉంటున్నారు. దాని మీద కన్నేసిన వారు దందాలకు తెర తీశారు. మధ్యవర్తిగా రంగంలోకి దిగిన వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి సెటిల్మెంట్ కి ఆ కుటుంబాన్ని పిలవడమే కాదు, ఎంతో కొంత ధరకు ఆ మొత్తం ఇంటికి అమ్మాలని బెదిరించారని ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేరుని కూడా ఉపయోగించుకున్నారు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేని పరిస్థితి. ఇక కలెక్టర్ ని సైతం ఈ విషయంలోకి లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.దాని మీద విజయసాయిరెడ్డి నేరుగా జగన్ కే ఫిర్యాదు చేయడంతో పూర్తి సమాచారం తెప్పించుకున్న మీదట ప్రసాదరెడ్డి దందా చేయడం నిజమేనని తేలిపోయింది. దాంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలే స్రుష్టిస్తోంది. విజయసాయిరెడ్డి దీని మీద మీడియా ద్వారా ప్రజలకు అధికారులకు విన్నపం చేశారు. తన పేరిట ఎవరు ఎలాంటి బెదిరింపులు దందాలు చేసినా కఠినంగా శిక్షించాలని పోలీసులకు కూడా చెప్పేశారు. ఇదిలా ఉండగా కొయ్య చేసినది ఇదొక్కటే సెటిల్మెంటా లేక మరిన్ని ఉన్నాయా అన్నది ఇపుడు పార్టీలో చర్చకు వస్తోంది. ఇక జగన్ సర్కార్ దందాలను తాము ఉపేక్షించమని చెప్పడంతో కొయ్య బాధితులు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.వైసీపీ తీసుకున్న ఈ సస్పెన్షన్ నిర్ణయం వల్ల పార్టీ పరువు నిలిచిందా? లేక పోయిందా? అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. వైసీపీ క్లీన్ ఇమేజ్ తో ఉంది. ఇప్పటిదాక దందా కేసులు లేవు కూడా. గత టీడీపీ హయాంలోనే విశాఖలో భూ దందాలు జరిగాయి. ఇపుడు అతి ముఖ్యమైన నేత దందాలలో దొరికిపోవడంతో దొరకని వారు మరెంతమంది ఉన్నారోనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక్కరితో పోయేది కాదు, చాలా మంది వైసీపీ నేతలు సెటిల్మెంట్లలో ఉన్నారు, అందరి జాతకాలు బయటకు రావాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అడ్డ పంచెల వారు విశాఖను ఆక్రమించుకున్నారని తాము ముందే చెప్పామని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తూంటే వైసీపీ సస్పెన్షన్ కధ ఎలా ఉన్నా ప్రభుత్వ ఇమేజ్, పార్టీ పరువు డ్యామేజ్ అయ్యాయన్న మాట మాత్రం వినిపిస్తోంది. ఇకమీద ఇదే తీరున కఠినంగా ఉండకపోతే వైసీపీ దొరికిపోవడం ఖాయమని కూడా అంటున్నారు.

Related Posts