YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ ఆగస్టు 15, 
74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  జి. కిషన్ రెడ్డి  న్యూఢిల్లీ లోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా అయన  భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కోవిడ్ ప్రోటోకాల్కు అనుగుణంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వ్యక్తులతో మంత్రి మాట్లాడుతూ, దేశానికి పవిత్రమైన, ముఖ్యమైన ఈ రోజు  ప్రాముఖ్యతను మంత్రి గుర్తుచేసుకున్నారు. "మన స్వాతంత్ర్య పోరాటంలో మహానభావులు అనుసరించిన మార్గం, తమ జీవితాలను స్వాతంత్య్ర సిద్దికోసం ఈ విధంగా పోరాటం చేశారో స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారి గొప్ప విలువలను అనుసరించాలని", మంత్రి కోరారు.
కేంద్ర భద్రతా దళాలు దేశ సేవలో నిర్వహిస్తున్న పాత్రను ఈ సందర్భంగా  కిషన్ రెడ్డి అభినందించారు. దేశానికి వారు చేసిన నిస్వార్థ సేవకు వారికి, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి సమయంలో, కేంద్ర భద్రతా దళాల సేవ మరువలేనిది అని పేర్కొన్నారు. "మనమందరం ఒక సంకల్పం తీసుకొని దేశాన్ని అభివృద్ధి, కీర్తి మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయాలి", అని  కిషన్ రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.  

Related Posts