హైదరాబాద్ ఆగస్టు 15,
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసారు. శ, విదేశాల్లో ఉన్న భారతీయులు అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుమాట్లాడుతూ ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వాళ్లందరినీ మనసులో స్మరించుకుని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇదని అన్నారు. అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖిత పూర్వక రాజ్యాంగం, ప్రాధమిక హక్కులు, ఆదేశ సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా మన దేశాన్ని తీర్చిదిద్దారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. వ్యవస్థలకు తూట్లు పొడవడం, హక్కులు కాలరాయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం వ్యక్తిద్రోహమే కాదు సమాజద్రోహం కూడా..
హక్కులను నిలబెట్టుకోవడం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుకోవడం, వ్యవస్థలను-రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే జాతీయ వీరులకు మనం అందించే నిజమైన నివాళిగా చంద్రబాబు పేర్కొన్నారు.