YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చైనా వస్తువులు నిషేధించాల్సిందే

చైనా వస్తువులు నిషేధించాల్సిందే

న్యూఢిల్లీ, ఆగస్టు 15, 
భారత్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా భారత్ ధైర్యంతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం దేశాన్ని కరోనాతో పాటు వరదలు కూడా చుట్టుముట్టాయన్నారు. వీటిని అధిగమించి త్వరలోనే భారత్ బయటపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం కృషి చేస్తున్న సైనికులు, పోలీసులకు వందనాలు తెలియజేస్తున్నాన్నారు. ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యమని తెలిపారు. భారత స్వతంత్ర సంగ్రామం ప్రపంచానికే దిక్సూచీగా నిలిచిందన్నారు మోదీ. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.కరోనా మనకు ఇబ్బంది కలిగించినా మన కాళ్ల మీద మనం నిలబడేలా చేసిందన్నారు. ప్రస్తుతం మనం అనేక వైద్య పరికరాలను తయారీ చేసుకునే స్థితికి వచ్చామన్నారు. లోకల్ గా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందన్నారు. కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని చెప్పారు. మళ్లీ భారత్ వస్తువులకు పూర్వ వైభవం తీసుకువద్దామన్నారు. చైనా వస్తువల దిగుమతిని పూర్తిగా నిషేధించాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు వెళదామన్నారు. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి పేరు అన్నది మరోసారి నిరూపిద్దామన్నారు. ఎఫ్.డి.ఐలో గత ఏడాది 18 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఇప్పటికే లక్షలాది గ్రామాలకు ఫైబర్ నెట్ వర్క్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. మేకిన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్క బడ్డాయన్నారు. అక్కడ పునర్విభజన ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు.
మహిళా సాధికారికత కు పెద్ద పీట
మహిళా సాధికారికతకై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. మహిళల ఆరోగ్యం, అభ్యున్నతికై పాటుపడుతున్నట్లు తెలిపారు. ‘‘దాదాపు 5 వేలకు పైగా జన్‌ ఔషధి కేంద్రాల ద్వారా పేద మహిళలకు 5 కోట్లకు పైగా శానిటరీ ప్యాడ్లను కేవలం ఒక రూపాయికే అందించాం. మహిళా సాధికారికతకు పెద్దపీట వేశాం. ట్రిపుల్‌ తలాక్‌ వంటి చట్టాలు తీసుకువచ్చాం. నావికా దళం, వాయుసేనలో సముచిత స్థానం కల్పించాం. అదే విధంగా మన కూతుళ్ల కనీస వివాహ వయస్సు నిర్ధారణ గురించి అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాం. ఇందుకు సంబంధించిన నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు
కరోనా వ్యాక్సిన్ కు రోడ్ మ్యాప్
 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్  నివారణకు సంబంధించి మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు ఆమోదం, అనుమతి లభించి వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామనీ, దానికోసం రోడ్‌మ్యాప్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు.  దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు ,ఇతర కరోనా యోధులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక విపత్కర సమయంలో ఉన్నాం. ఈ మహమ్మారి కారణంగా తాను పిల్లలను ఎర్రకోటవద్ద చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 130 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో,  ఈ మహమ్మారిని ఓడిస్తామని ప్రధాని మోదీ అన్నారు.

Related Posts