ముంబై, ఆగస్టు 15,
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు బ్యాంకులు గట్టి ఝలక్ ఇచ్చింది. రూ.10 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ 4 బ్యాంకులు నిబంధనలను అతిక్రమించాయని అందుకే ఫైన్ విధించినట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. ఈ నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులు కావడం గమనార్హం.
జోవై కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, కృష్ణనగర్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్, టురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వంటి వాటిపై జరిమానా విధించినట్లు రిజర్వు బ్యాంక్ తెలియజేసింది. ఈ బ్యాంకులు అన్నీ నిబంధనలు అతిక్రమించాయని అందుకే జరిమానా విధించామని ఆర్‌బీఐ తెలిపింది.జోవై కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్2పై రూ.5 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కృష్ణనగర్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.2 లక్షలు, టురా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొంది. ఇక చివరిగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ప రూ.లక్ష ఫైన్ వేసినట్లు తెలిపింది.
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ అసెట్ క్లాసిఫికేషన్ విధానాన్ని అనుసరించాలని జూన్ 30న ఆర్‌బీఐ కోరింది. 2020 మార్చి 31 నాటికి బ్యాంకుల మొత్తం ఆస్తుల విలువ రూ.2,000 కోట్లకు పైన ఉంటే అవన్నీ సిస్టమ్ బేస్డ్ అసెట్ క్లాసిఫికేషన్ విధానాన్ని అనుసరించాలని ఆదేశించింది. అలాగే రూ.1000 కోట్లకు పైన రూ.2,000 కోట్లకు లోపు ఆస్తుల విలువ కలిగిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా సెప్టెంబర్ 30 నుంచి ఈ రూల్‌ను అనుసరించాల్సిందే. ఈ రూల్‌ను ఫాలో అవ్వని బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానా విధిస్తోంది