కృష్ణా జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ జయంతి ని ప్రభుత్వ పర్వదినంగా ప్రకటించాలి. రాజ్యాంగాన్ని రక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించాలని వైకాపా నేత బోత్స సత్యనారాయణ అన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆలోచనలు మారాలి. వ్యవస్థ కు ముప్పు తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అన్నీ వర్గాల శ్రేయస్సు కోసం వైసీపీ పనిచేస్తుంది. సొంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్ లో అమార్ సింగ్ తో జీఎస్ఎల్ గ్రోప్ అధినేత ను చంద్రబాబు కలిసారు. అవ్వా సీతారాం ను ఎందుకు అరెస్ట్ చేయరు? బాధితులకు ఎప్పటికి న్యాయం చేస్తారో కుటుంబరావు చెప్పాలని డిమాండ్ చేసారు. మరో వైకాపా నేత పార్థసారథి మాట్లాడుతూ ప్రజా స్పందన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. విజయవాడలో వచ్చిన స్పందన రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అందులో లాభం ఉండాల్సిందే. అమరావతి రాజధాని చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారి కోసమే. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రైతులు పండించే మూడు పంటల భూములను బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవ్వరూ బాబు పాలనపై సంతృప్తిగా లేరని అన్నారు.