హైదరాబాద్ ఆగస్టు 15,
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో ఎమ్మార్వో లంచం తీసుకుంటూ పట్టుబడడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. కీసర ఎమ్మార్వో నాగరాజు తన ఇంట్లోనే కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఏ.ఎస్.రావు నగర్ లో లంచం తీసుకుంటూ అధికారులు ట్రాప్ వేసారు. శనివారం నాడు నాగరాజు ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు.
రాంపల్లి లో ఇరవై ఎనిమిది ఎకరాల భూమి సెటిల్మెంటు కు డాను పెద్ద మొత్తంలో లంచం నాగరాజు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు న్యూక్లియర్ చేసేందుకు కోటి పది లక్షల లంచం నాగరాజు అడిగాడు. ఎమ్ఆర్ఓ నాగరాజ్ తోపాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్ ,కన్నడ అంజి రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో లంచం నగదుకాకుండా అయన ఇంట్లో వున్న సుమారు28 లక్షల నగదు, కిలోన్నర్ర బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.