YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ - రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ -  రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

పెద్దపల్లి  ఆగస్టు 15
మన  రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపట్టిన   కార్యక్రమాల ద్వారా పలు రంగాలో  తెలంగాణ  దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని  రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి  ఈటెల  రాజేందర్ అన్నారు.  శనివారం  కలెక్టరేట్ లో   నిర్వహించిన   74వ స్వాతంత్ర్య దినొత్సవ వేడుకలో  మంత్రి పాల్గోన్నారు.  కోవిడ్ 19  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా   వేడుకలను నిర్వహించారు.     రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి  కలెక్టర్  కార్యాలయంలో   గౌరవ వందనం స్వీకరించి  జాతీయపతాకావిష్కరణ చేసారు.  అనంతరం  మంత్రి మాట్లాడుతూ  బ్రిటీష్ వలస పాలకుల  పాలన నుండి  ఎందరో మహనీయుల  పోరాట  ఫలితంగా మన దేశం 73 సంవత్సరాల క్రితం విముక్తి పొంది స్వాతంత్ర్య దేశంగా అవతరించిందని అన్నారు.  స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మంత్రి అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.  దేశంలో 29వ  రాష్ట్రంగా అవతరించిన  తెలంగాణ   అనేక రంగాలో   విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని,  ఉమ్మడీ  రాష్ట్రంలో ఉన్న  విద్యుత్,  త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకున్నామని అన్నారు.
  ఉత్తర తెలంగాణ  ప్రాంతానికి   సాగునీరందించే   కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్నీ  రికార్డు  సమయంలో  పూర్తి చేసామని అన్నారు.   పేదరిక సమయ పరిష్కారం కోసం   నూతన  రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.  కరోనా విపత్కర సమయంలో  , ఆర్థిక సమస్యలను  ఎదుర్కుంటూ   సైతం  పేదల సంక్షేమంలో ఎటువంటి కోత విధించలేదని  మంత్రి తెలిపారు.   ఆసరా  పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్  పథకాలను అమలు చేస్తున్న  ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రి తెలిపారు.   దేశం కొనుగొలు చేసిన ధాన్యంలో మన  తెలంగాణ   రాష్ట్రం 54%    ధాన్యం  ఎఫ్.సి.ఐకు అందించి  దేశానికి అన్నపూర్ణగా*  అవతరించిందని  అన్నారు.   .   రాష్ట్రం అమలు చేస్తున్న   కార్యక్రమాలను జిల్లాలో పకడ్భందిగా అమలు చేస్తున్నారని, భవిష్యత్తులో   పెద్దపల్లి జిల్లా అన్ని   రంగాలలో అభివృద్ది చెందే దిశగా    పనిచేస్తున్నామని అన్నారు.  అనంతరం  కలెక్టరేట్  కార్యాలయంలో   స్వాతంత్ర్య దినొత్సవం నాడు  ఈ ఆఫీస్  ను  మంత్రి ప్రారంభించారు,  ప్రజలకు పారదర్శకంగా ఈ ఆఫీస్ ద్వారా సేవలు అందుతాయని  ఆశాభావం వ్యక్తం చేసారు.   కరోనా మహమ్మరి అంశం  పై మంత్రి  అదనపు కలెక్టర్, ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో  స్వాతంత్ర్య దినొత్సవం సందర్భంగా మంత్రి ముచ్చటించారు. కరోనా విషయంలో  ప్రజలు  అనవసర ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని,  అదే సమయంలో నిర్లక్ష్యం వద్దని  మంత్రి తెలిపారు.   నిర్లక్ష్యంగా వ్యవహరించడం,  అతి భయం  ప్రస్తుత సమయంలో  ప్రమాదకరమని మంత్రి అన్నారు.    ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రి  కోరారు. ప్రస్తుత  కరొనా పరిస్థితులలో  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,  ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని   మంత్రి తెలిపారు. కరొనా వైరస్ విజృంభించినప్పటికి  ప్రజలకు వైద్యం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నామని,  ప్రజల వైద్యానికి అవసరమైన బెడ్లు,  పిపిఈ కిట్లు,  మందులను సిద్దం చేసామని  తెలిపారు.    కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే  వెంటనే ప్రజలు వారి సమీపంలోని ప్రాథమిక ఆరొగ్య కేంద్రంలో  సందర్శించి వైద్య పరిక్షలు చేసుకోవాలని,  మొదటిలో వైరస్ ను గుర్తించినట్లయితే సంపూర్ణంగా   కొలుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని మంత్రి అన్నారు.   కరోనా  విషయంలో అతిజాగ్రత్తలు,  మూడనమ్మకాలు అనవసరమని, మన మానవతా విలువలను విస్మరించవద్దని  ,  కరోనా  సోకిన వారిలో 99%  పైగా కోలుకుంటూన్నారని  మంత్రి తెలిపారు.     కరోనా   సోకిన వారిని  ప్రజలు  తక్కువచేసి చుస్తున్నారని, ఇది సాధారణ వైరస్  ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.   కరోనా సోకిన వారి పట్ల వివక్ష అవసరం లేదని మంత్రి తెలిపారు.  భవిష్యత్తులో మంచి వ్యాక్సిన సైతం వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.   రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని,  సీజనల్ వ్యాధులు  పెరిగే అవకాశం ఉంటుందని,  ప్రజలకు  అవసరమైన వైద్యం అందించేందుకు సన్నద్దంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.     కరోనా  వైరస్ ను త్వరితగతిన గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో ఆశాకార్యకర్తలు, ఎఎన్ఎంలు,  ప్రాథమిక ఆరొగ్య కేంద్ర పరిధిలో వైద్యులు సమన్వయంతో పనిచేయాలని,  కరోనా వైరస్ లక్షణాలు గల వారిని వేంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని  మంత్రి సూచించారు.    జిల్లా ప్రజాపరిషత్  చైర్మన్ పుట్టమధు, అదనపు కలెక్టర్  లక్ష్మీనారాయణ,   పెద్దపల్లి ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి,  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  కుమార్ దీపక్   ,  డిసిపి  రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రఘువీర్ సింగ్,   ,  పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్  మమతా రెడ్డి, జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి కె నరసింహమూర్తి, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్,రామగుండం మున్సిపల్  కమిషనర్  ఉదయ్ కుమార్ ,  రామగుండం డిప్యూటి మేయర్ అభిషేక్ రావు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు  ఈ  కార్యక్రమంలో పాల్గోన్నారు.

Related Posts