YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఆమ‌ని చేతుల మీదుగా వ‌న్ బై టు పోస్ట‌ర్ ఆవిష్కరణ

 ఆమ‌ని చేతుల మీదుగా వ‌న్ బై టు పోస్ట‌ర్ ఆవిష్కరణ

`అమ్మ దీవెన‌` చిత్రంతో ద‌ర్శ‌కుడుగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన   శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌రో చిత్రం 1/2 ( వ‌న్ బై టు).  దారం ప్ర‌భుదాస్ స‌మ‌ర్ప‌ణ‌లో చెర్రి క్రియేటివ్ వర్క్సు  ప‌తాకంపై క‌ర‌ణం శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్, శ్రీ ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లు. స్వాతంత్య్ర దినోత్సవం  సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ఆమ‌ని చేతుల మీదుగా ఆవిష్క‌రించారు...
ఈ సంద‌ర్భంగా ఆమ‌ని మాట్లాడుతూ...``శివ ఏటూరి గారితో నేను `అమ్మ దీవెన‌` చిత్రం చేశాను. ఆ సినిమాతో త‌న‌తో నాకు మంచి ప‌రిచ‌యం ఏర్పడింది. తను ఎంతో ప్ర‌తిభావంతుడు కూడా. త‌న రెండో చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు నేను లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మోష‌న్ పోస్ట‌ర్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ సినిమా విజ‌యం సాధించి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు తీసుక‌రావాల‌ని మ‌న‌స్పూర్తిగా  కోరుకుంటున్నా`` అన్నారు.
ద‌ర్శ‌కుడు శివ ఏటూరి మాట్లాడుతూ...`ఈ రోజు ఆమ‌ని గారి చేతుల మీదుగా నా రెండో సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది.  ఇదొక ఇంటెన్సివ్ ల‌వ్ స్టోరి. మా నిర్మాత పూర్తి స‌హ‌కారంతో ఫ‌స్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేశాం. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఏక‌ధాటిగా చేయ‌బోయే షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. మిగ‌తా వివ‌రాలు త్వ‌‌ర‌లో వెల్ల‌డిస్తాం`` అన్నారు.
నిర్మాత క‌రణం శ్రీనివాస‌రావు మాట్లాడుతూ..`` అంద‌రికీ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.  శివ ఏటూరి  స్టోరి  న‌న్ను ఎంతో  ఇంప్రెస్ చేయ‌డంతో ఈ సినిమా నిర్మిస్తున్నా. `అమ్మ దీవెన‌, అస‌లేం జ‌రిగిందంటే, నీవ‌ల్లే నేనున్నా, చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన శ్రీ ప‌ల్ల‌వి మా చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది.  అలాగే త‌మిళంలో స‌న్ టీవీ యాంక‌ర్ గా ఎంతో ఫేమ‌స్ అయిన ఆనంద్ హీరోగా న‌టిస్తున్నాడు. వీళ్లిద్ద‌రి పెయిర్ బాగా కుదిరింది. అలాగే సాయి కుమార్ , కాశీ విశ్వ‌నాథ్ గార్ల పాత్ర‌లు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఆమ‌ని గారు ఆవిష్క‌రించిన  మా  చిత్రం మోష‌న్ పోస్ట‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది``అన్నారు.

Related Posts