YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలి ప్రదానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలి ప్రదానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు

న్యూఢిల్లీ ఆగష్టు 15        
ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలని ప్రదానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు.25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంత కాళ్లపై నిలబడాలని కుంటుంబం కోరుకుంటుందని, ఈ క్షణం స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్‌ అనేది కేవలం నినాదం కాదని, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం మనందరి సంకల్పం కావాలన్నారు. దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలని చెప్పారు. భారత్‌ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదు ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కర ఏకాకిగా మనలేరన చెప్పారు. విశ్వకల్యాణానికి మనవంతు కూడా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.  ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ప్రపంచంతో మరింత మమేకం కావడమన్నారు. మన శక్తి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలచుకోవాలని సూచించారు. ఇంక ఎంతకాలం ముడి పదార్థాల ఎగుమతి దారుగా మిగిలిపోదాం అని ప్రశ్నించారు. ప్రపంచానికి కావాల్సిన వస్తు ఉత్పత్తిని అత్యున్నత ప్రమాణాలతో తయారు చేద్దామని పిలుపునిచ్చారు. ఆధునిక వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్‌ భారత్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే మన రైతులు నిరూపించి చూపారని, భారత్‌ను ఆకలి రాజ్యం నుంచి అన్నదాతగా మార్చారని కొనియాడారు. మన రైతులే ప్రేరణగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధిద్దామన్నారు. భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా వస్తు ఉత్పత్తి చేద్దామన్నారు. భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న ఆత్మగౌరవాన్ని తేవాలన్నారు. ఒక నాడు భారత వస్తువులంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేదని, మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. కరోనా కష్టకాలంలోనూ మనం కొత్తదారులు వెతుక్కుందామన్నారు. పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని, నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తు చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీప శిఖలా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు.. భారతీయ రక్షణ దళాలు, పోలీసులు దళాలు మనల్ని నిరంతరం రక్షిస్తున్నాయన్నారు. దేశ సరిహద్దులో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు పోలీసులకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయణిస్తోందని, కరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం చేశారు. మహమ్మారి నివారణకు వైద్యులు, నర్సులు, అంబులెన్స్‌ డ్రైవర్లు అందరూ ప్రజల ఆరోగ్యానికి కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కరోనా ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టు ముట్టాయన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుధృడం చేస్తాయన్నారు.
75 ఏళ్లు పూర్తయ్యే సరికి మరో ముందడుగు వేస్తాం
75 ఏళ్ల స్వతంత్య భారతంలో ఎన్నో సాధించామని, మనం ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. 75 ఏళ్లు పూర్తయ్యే సరికి మరో ముందడు వేస్తామని స్పష్టం చేశారు. ప్రాణాలు తృణప్రాయంగా వదలి మన పూర్వీకులు స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు. జాతి ఒక్కటై స్వాతంత్ర్య సంగ్రామంలో నిలిచిందని, భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీప శిఖవంటిదన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న అనేక దేశాలకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. విస్తరణ వాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి భారత్‌ కొత్త దారి చూపిందన్నారు. ప్రపంచమంతా భారత్‌ చూపిన బాటలో నడిచి కొత్త ప్రపంచానికి నాంది పలికాయన్నారు. స్వాతంత్ర్య సంగ్రామ నిరంతర ప్రేరణతో దేశం ముందుకు సాగుతోందని, ఆత్మనిర్భర్‌ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశం ఒక్కటై నిలబడిందన్నారు.
వోకల్‌ ఫర్‌ లోకల్‌ మాటను నిలబెట్టుకోవాలి
వోకల్‌ ఫర్‌ లోకల్‌ మాటను నిలబెట్టుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులను మనం గౌరవించకపోతే ప్రపంచం ఎలా గౌరవిస్తుందని, మన అనందరం మన ఉత్పత్తులకు మన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిద్దామనన్నారు. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఆహార ఉత్పత్తి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలకు యత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్‌ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించామన్నారు. అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుందన్నారు. ఎఫ్‌డీఐ ల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు.

Related Posts