న్యూ ఢిల్లీ ఆగష్టు 15
మూడు రకాల కరోనా వైరస్ వ్యాక్సిన్లు ట్రయల్స్ దశల్లో ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ.. ఆ టీకాలను ప్రతి ఒక భారతీయుడికి అందే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ మిషన్ కింద ప్రతి ఒక భారతీయుడికి హెల్త్ ఐడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత్‌లో ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం మూడు రకాల టీకాలు.. వివిధ దళల్లో టెస్టింగ్ జరుగుతోందన్నారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఆ టీకాలను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే ప్రతి ఒకరికి టీకా అందేవిధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. హెల్త్ ఐడీలు ఇవ్వనున్నామని, ప్రతిసారి డాక్టర్‌ను కానీ ఫార్మసీని కానీ విజిట్ చేస్తే, దాంట్లో మీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఉంటుందన్నారు. మూడు రకాల కరోనా వైరస్ వ్యాక్సిన్లు ట్రయల్స్ దశల్లో ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ.. ఆ టీకాలను ప్రతి ఒక భారతీయుడికి అందే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ మిషన్ కింద ప్రతి ఒక భారతీయుడికి హెల్త్ ఐడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత్‌లో ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం మూడు రకాల టీకాలు.. వివిధ దళల్లో టెస్టింగ్ జరుగుతోందన్నారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఆ టీకాలను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే ప్రతి ఒకరికి టీకా అందేవిధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. హెల్త్ ఐడీలు ఇవ్వనున్నామని, ప్రతిసారి డాక్టర్‌ను కానీ ఫార్మసీని కానీ విజిట్ చేస్తే, దాంట్లో మీ హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఉంటుందన్నారు.