గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో.. ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించవద్దని కేంద్రప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అలంకరణల కోసం పేపర్ జెండాల బదులు ప్లాస్టిక్ జెండాలను వినియోగిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ లేఖల్లో పేర్కొంది.
ప్లాస్టిక్ జెండాలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయని, కొందరు వాటిని తొక్కుకుంటూ అలాగే ముందుకువెళ్తుంటారని పేర్కొంది. దీంతో జాతీయ జెండాకు అవమానం జరిగినట్లు భావించాల్సి వస్తుందని, ఈ సమస్య ప్రతియేటా ఎదురవుతున్నదని వివరించింది.