YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

9 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తితో పెళ్లి ..

9 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తితో పెళ్లి ..

భగ్నం చేసిన పోలీసులు..

మరింత దిగజారిపోయే రీతిలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. తిరుచ్చిలో 9 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకోబోయాడు. కనీసం రజస్వల కూడా కాని అభం శుభం తెలియని ఆ బాలికను వివాహం చేసుకోబోయాడు ఆ వ్యక్తి. అయితే, అదృష్టవశాత్తూ ఆ బాలికకు బాల్యవివాహం అనే సంకెళ్లు తెగిపోయాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలోని మూసిరిలో జరిగింది. ఆ బాలికను ప్రభుత్వ అధీనంలోని బాలికల రక్షణ, సంరక్షణ గృహానికి మూసిరికి చెందిన ఓ వ్యక్తి అప్పగించారు. బాల్య వివాహం గురించి మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. నాలుగో తరగతి చదువుతున్న బాలికను తొట్టియంలోని మిన్నథంపట్టి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారని అతడు పోలీసులకు చెప్పాడు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిస్థితులు అనుమానస్పదంగా ఉండడంతో బాలికను అధీనంలోకి తీసుకుని ఆ రాత్రే శిశు సంక్షేమ కమిటీకి (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. సీడబ్ల్యూసీ విచారణలో ఆ వివాహం తాలూకు వివరాలు వాస్తవమేనని తేలింది. కాగా, ప్రస్తుతం ఆ బాలిక తమ సంరక్షణలోనే ఉందని సీడబ్ల్యూసీ తిరుచ్చి చైర్ పర్సన్ ఎస్ ఇందిరా గాంధీ తెలిపారు. అయితే, తమ కులంలో అది సర్వసాధారణంగా జరిగేదేనని పలువురు గ్రామస్థులు పోలీసులకు చెబుతున్నారు. ‘బంధాలు దృఢంగా’ ఉండేందుకు రక్తసంబంధీకులతోనే ఇలాంటి వివాహాలను జరిపిస్తుంటామని అంటున్నారు. 

Related Posts