YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భగవంతుడు.....

భగవంతుడు.....

భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు కన్నులు మూసుకుంటాం... ఎందుకు...
కొందరు భగవంతుని ఉపాసనను ఒక విగ్రహాన్ని ముందుంచుకొనో, ఒక పఠాన్ని పెట్టుకొనో చేస్తారు. అంటే ఒక రూపాన్ని దర్శిస్తూ చేస్తారు. ఇలా చేయటంలో ఆ విగ్రహమే పరమాత్మ అనే భావం అనుకోకుండానే వచ్చేస్తుంది. ఆ విగ్రహాన్ని భగవంతునిగా భావించి సేవలు చేస్తారు.
ఎలాంటి భావం వస్తుందనో ఏమో.. భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించటంతో బాటు రెండు కన్నులు మూసుకుంటాం. ఎందుకు... నిజంగా భగవంతుడు ఆ విగ్రహం కాదు. ఆయన నీలోనే ఉన్నాడు. కన్నుల ముందున్న విగ్రహాన్ని గాక నీలోనే ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి, గ్రహించటానికి కన్నులు మూసుకొని బుద్ధిని(జ్ఞాననేత్రాన్ని) తెరువు అని చెప్పటమే.
మనం కొలిచే రూపమే పరమాత్మయనే నమ్మకం ప్రబలటంతో కొన్ని రూపాలను ద్వేషించే స్థితి కూడా వస్తుంది. మూఢత్వం పెరిగిపోతున్నది. నిజంగా పరమాత్మకు ఆకారం లేదు. రూపం లేదు. అది నిరాకారం. నిరాకార తత్త్వాన్ని కన్నులు చూడలేవు కనుక కన్నులు చూడగల రూపాన్ని కన్నుల ముందుంచుకొని ఉపాసన చెయ్యటం ఒక ఉపాయంగా మనకు పురాణాలలో సూచించారు.
కాని ఎల్లకాలం అదే పట్టుకు ప్రాకులాడ కూడదు. మనం నదిని దాటటానికి పడవను ఏర్పాటు చేశారు. కాని ఎల్లకాలం ఆ పడవను మనతో తీసుకు వెళ్ళాలనుకో రాదు. నది దాటేంత వరకే దాని అవసరం. అలాగే నిరాకార నిర్గుణ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించేంత వరకే ఈ సాకారోపాసన చెయ్యాలి గాని అదే లక్ష్యంగా చెయ్యరాదు. నీ దృష్టి విగ్రహం మీద నుండి నిరాకార పరమాత్మ వైపుకు మళ్ళాలి. అలా మళ్ళటానికే కొన్ని పండగలు సాంప్రదాయాలు.
వినాయకచవితి నాడు నిరాకారమైన మట్టికి ఒక ఆకారం కల్పిస్తాం. ఆ విగ్రహాన్ని పత్రితో పూజిస్తాం, మరునాడు జల్దిలో కలుపుతాం. ఎందుకు... నిరాకార తత్త్వాన్ని సాకారం చేసి పూజించి, తిరిగి నిరాకారంగా మార్చేందుకే. నిరాకారమే నిత్యం, సత్యం...
|| ఓం నమః శివాయ ||

Related Posts