YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరో ఐపీఎస్ ఫెయిల్యూర్ స్టోరీ

మరో ఐపీఎస్ ఫెయిల్యూర్ స్టోరీ

శ్రీనగర్, ఆగస్టు 17,
చేయాలంటే ప్రజాసేవ ఎలాగైనా చేయొచ్చు. రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాలనుకుంటే అది అందరికీ సాధ్యంకాదు. ప్రధానంగా ప్రజాసేవ కోసం ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోెకి వచ్చిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ను మనం ప్రత్యక్షంగా చూశాం. ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఇదే పరిస్థితి మరో యువ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ కు కూడా సేమ్ పరిస్థితి ఎదురైంది.ఐఏఎస్ అధికారిగా షా ఫైజల్ ప్రజలకు సేవ చేయవచ్చు. కానీ ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ఏడాది క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ అని పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా యువతను ఆకర్షించి పార్టీలోకి తీసుకు వచ్చి రాజకీయంగా నిలదొక్కుకోవాలనుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా షా ఫైజల్ రాజీనామా చేశారు.ప్రజాసేవ చేసే వీలున్నా….2010 బ్యాచ్ కు చెందిన షా ఫైజల్ నిజంగా ఐఏఎస్ అధికారిగా ప్రజలకు ఎంతో సేవలు అందించవచ్చు. అయితే ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో వివాదాస్పద వ్యక్తిగా మారారు. సొంతంగా పార్టీ పెట్టి జమ్మూ కాశ్మీర్ లో నిలదొక్కుకోవాలనుకున్నారు.కానీ 370 అధికరణ రద్దుతో షా ఫైజల్ ను కూడా ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. గత జూన్ లో విడుదల చేసింది.
క్లిక్ కాలేమని తెలిసి…..అయితే షా ఫైజల్ కు ఇప్పుడు తెలిసొచ్చింది. రాజకీయాలు అంత ఈజీ కాదని. అందుకే ఆయన తిరిగి సర్వీస్ లోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. షా ఫైజల్ రాజీనామాను ఇంతవరకూ ప్రభుత్వం ఆమోదించలేదు. దీంతో ఆయన తిరిగి విధుల్లోకి చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ వ్యవస్థాపకుడు అన్న పదాన్ని డిలీట్ చేశారు. మరి ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తుందా? ఫైజల్ తిరిగి విధుల్లోకి చేరతారా? అన్నది తెలియాల్సి ఉంది.

Related Posts