YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎన్నికలకు బీహారీ పార్టీలు రెడీ

ఎన్నికలకు బీహారీ పార్టీలు రెడీ

పాట్నా, ఆగస్టు 17, 
బీహార్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. అక్బోబరు నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బీహార్ లో ఎన్నికలు వాయిదా వేయాలని అనేక పార్టీలో కోరినా ఎన్నికల కమిషన్ మాత్రం సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కవుగా ఉండటం, వరదల వంటి సమస్యలతో బీహార్ లో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ, జేడీయూ మినహా దాదాపు అన్ని పార్టీలూ కోరాయి.నవంబరు 29వ తేదీతో బీహార్ శాసనసభ కాలపరిమితి ముగుస్తుంది. అంటే అక్బోబరు మొదటి వారంలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిపై ఎన్నికల కమిషన్ నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఎన్నికల ను నిర్వహించిన విషయాన్ని కూడా ఇందుకు గుర్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఉంది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో తక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలను అత్యధిక సంఖ్యలో పెంచనున్నారు. పోలింగ్ సిబ్బందిని అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చే ప్రతిపాదనను కూడా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. ఎన్నికల జరిగే నాటికి వైరస్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందన్న అంచనా కూడా ఉంది. ఇప్పటికే దేశంలో అన్ని కార్యక్రమాలు ప్రారంభం కావడంతో ఎన్నికలను వాయిదా వేయడం మంచిది కాదన్న నిర్ణయానికి ఎన్నికల కమిషన్ వచ్చిందిఅయతే ఎక్కువ మంది ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు కరోనా కారకాలుగా మారే అవకాశం ఉందని, బ్యాలెట్ పేపర్లు వినియోగించాలన్న వాదన కూడా ఉంది. అయితే బ్యాలెట్ పేపర్లకంటే ఈవీఎంలనే నయమంటున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ, లేదా గ్లౌజులు ధరించి ఈవీఎంలను ఉపయోగించవచ్చని కూడా నిపుణులు సూచిస్తున్నాను. మొత్తం మీద మరో మూడు నెలల్లోనూ బీహార్ ఎన్నికలు ఉండే అవకాశముంది.

Related Posts