YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గంటా బాటలో అంజిబాబు.. ?

గంటా బాటలో అంజిబాబు..  ?

ఏలూరు, ఆగస్టు 17, 
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. పార్టీ మారుతున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి.గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న ఏడాదిన్నర‌గా పార్టీ త‌ర‌ఫున యాక్టివ్ కార్యక్రమాలేవీ చేయ‌డం లేదు. పోనీ.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారా ? అంటే అది కూడా లేదు. పైగా.. ఆయ‌న ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారుతున్న చ‌రిత్ర ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైఎస్సార్ సీపీవైపు చూస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సీఎం జ‌గ‌న్ కూడా ప‌చ్చజెండా ఊపిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఆయ‌న కండువా మార్పున‌కు ముహూర్తం కూడా ఫిక్సయ్యింద‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే ప్రచారం జ‌రుగుతోంది.అయితే, గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే.. ఆయన వియ్యంకులుగా ఉన్న ఇద్దరు నేత‌ల ప‌రిస్థితి ఏంటి ? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. ఆయ‌న‌కు ఇద్దరు వియ్యంకులు ఉన్నారు. ఒక‌రు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమవ‌రం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కాగా, మ‌రొక‌రు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయ‌ణ‌. ఈ ఇద్దరూ కూడా టీడీపీ నేత‌లే. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. వీరిలో నారాయ‌ణ ముందునుంచి చంద్రబాబుకు న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. ఇక అంజిబాబు 2014 ఎన్నిక‌ల్లో గంటాతో పాటు సైకిల్ ఎక్కారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గంటా గెలిస్తే వియ్యంకులు ఇద్దరూ ఓడిపోయారు.ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా గంటా బాట ప‌డ‌తారా ? లేక సొంత పార్టీలోనే ఉంటారా ? అనేది చూడాలి. నిజానికి ఈ ఇద్దరూ పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే, నారాయ‌ణ పార్టీ మార‌తార‌నే ప్రచారం ఉన్నా.. ఆయ‌న పెద్దగా స్పందించ‌డం లేదు. త‌న విద్యా సంస్థల నిర్వ‌హ‌ణ‌పైనే దృష్టి పెట్టారు. వాస్తవంగా గంటా శ్రీనివాసరావు కంటే నారాయ‌ణే ముందు వైసీపీలోకి వెళ్లిపోతార‌న్న ప్రచారం జ‌రిగింది. ఇక‌, అంజిబాబు మాత్రం పార్టీ మార‌తార‌నే ప్రచారం జ‌రుగుతోంది. భీమవరంలో అంజిబాబు కొనసాగే అంశం సస్పెన్స్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడానికి సిద్ధం అవుతున్న తరుణంలో అంజిబాబు అంశంపై సమాలోచనలో పడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి భీమవరం నుంచి పోటీ చేసిన అంజిబాబు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల పట్ల కొంత దూరంగా ఉన్నారు. ఒకవైపు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పార్టీలో కూడా పెద్దగా కలిసిరాలేదని అసంతృప్తితోనే గడుపుతూ వచ్చారు. పార్టీ అధిష్ఠానం ముందస్తు హామీతో ఆర్థికభారాన్ని వ్యక్తిగతంగా మోయాల్సి వచ్చిందని, దాని సంగతి కూడా తేల్చాలన్నట్టుగా అధిష్ఠానానికి సన్నిహితుల ద్వారా సమాచారం పంపార‌ట‌. దీనిపై అధిష్ఠానం నోరు మెదపకపోవడంతో ఎన్నికల తరువాత సైలెంట్‌ అయ్యారు. ఇక ఎన్నిక‌ల త‌ర్వాత కూడా పార్టీ పిలుపు ఇచ్చిన ప‌లు కార్యక్రమాల‌కు ఆయ‌న ద‌రంగా ఉండ‌డంతో మాజీ రాజ్యస‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మితో పాటు ఇత‌ర నేతలు అక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. ఈ నేప‌థ్యంలో అంజిబాబు పార్టీ మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉందన్న టాక్ భీమ‌వ‌రం రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.

Related Posts