YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇంటిపేరే మంత్రి పదవికి అడ్డంకి....

ఇంటిపేరే మంత్రి పదవికి అడ్డంకి....

కరీంనగర్, ఆగస్టు 17, 
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఓటమి అనేది ఎరుగరు. అలాంటి నేతకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆయనే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు. ఆయన ఇంటిపేరే ఆయనకు మంత్రి పదవి దూరం చేసిందంటారు. నిజానికి అందరికన్నా సీనియర్ నేతగా, అవినీతి మచ్చ లేని నేతగా విద్యాసాగర్ రావుకు పేరుంది. కోరుట్ల నియోజకవర్గం నుంచి వరసగా నాలుగు సార్లు విజయం సాధించారు.  కానీ ఆయనకు కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ ఇంతవరకూ లభించలేదు. కోరుట్ల నియోజకవర్గం నుంచి విద్యాసాగర్ రావు 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే కోరుట్లలో విద్యాసాగర్ రావు ది వార్ వన్ సైడే. ఎందుకంటే ఇక్క ఆయనకు ప్రత్యర్థి అనే వారు లేకపోవడమే ఆయన వరస విజయాలకు కారణంగా చెప్పాలి. ఎమ్మెల్యేగా అయితే గెలుస్తున్నారు కాని ఆయనకు మంత్రి పదవి మాత్రం లభించడం లేదు.సీనియారిటీ ఉండటంతో ప్రతి సారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడల్లా విద్యాసాగర్ రావు ఆశతో ప్రగతి భవన్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు పోటీ ఎక్కువగా ఉందని భావిస్తే, జగిత్యాల జిల్లా ఏర్పడటంతో ఇక తనకు మంత్రి పదవి వస్తుందని విద్యాసాగర్ రావు గట్టిగా నమ్మారు. కానీ మరోసారి ఆ జిల్లా నుంచి సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా కొప్పుల ఈశ్వర్ కు లభించిందితెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా మంత్రి పదవి లభించకపోవడంపై ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యాసాగర్ రావు ఇంటిపేరు కల్వకుంట్ల కావడంతోనే మంత్రి పదవి దక్కడం లేదన్నదీ కూడా వాస్తవం. దీంతో పాటు ఎమ్మెల్సీ ఓటింగ్ సమయంలో విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయం ఆయనకు అధిష్టానం వద్ద మైనస్ గా మారిందంటారు. మొత్తం మీద విద్యాసాగర్ రావుకు భవిష్యత్తులోనూ మంత్రి పదవి దక్కడం కష్టమేనంటున్నారు. ఆయన ఇంటిపేరే మంత్రిపదవికి అడ్డంకిగా మారింది.

Related Posts