విశాఖపట్నం ఆగస్టు 17,
ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం బుంగ పుట్ పంచాయతీలకు చెందిన 18 గ్రామాలకు భారీ వర్షాలకు గడ్డలు పొంగి సంబంధాలు తెగిపోయింది, సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, రోడ్డు బాగా లేనందున ఈనెల రేషన్ బియ్యం కూడా అందని పరిస్థితులు ఏర్పడింది.రోడ్డు బాగు చేసి రేషన్ బియ్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం,ఋంగపుట్ పంచాయితీల మారుమూల గిరిజన గ్రామాలకు ప్రజలు ఈ వారం లో కురుస్తున్న భారీ వర్షాలకు గడ్డలు పొంగి సంబంధాలు తెగిపోయింది గతేడాది కురిసిన భారీ వర్షాలకు కుర్ల గ్రామం దగ్గర వంతెన కొట్టుకుపోయినది. ఈ వంతెన నిర్మాణం చేయాలని ఆయా గ్రామ ప్రజలు అధికారులకు తెలిపిన వంతెన, నిర్మాణం జరగనందున ఈ వారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష్మీపురం, బుంగ పుట్, పంచాయితీ చెందిన 18 గ్రామాల రాకపోకలు బంద్ అయ్యాయి. నిత్యవసర వస్తువులు అత్యవసర ఆరోగ్య సేవలు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఈనెల రేషన్ బియ్యం కూడా రోడ్డు బాగా లేనందున అందని పరిస్థితి వుంది.
రేషన్ బియ్యం కోసం లక్ష్మీపురం ప్రజలు 10 కిలోమీటర్ల దూరం అయినా భరడ జి సి సి డిపోకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది.ఈవారం కురుస్తున్న భారీ వర్షాలకు లేడీ ఘాటి రోడ్డు బాగా లేనందున ఎటువంటి వాహనాలు రాకపోకలు లేవు. సిసి రోడ్డు ఏర్పాటు చేసినట్లయితే కనీసం భరడ, లక్ష్మీపురం, వరకు వాహనాలు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.