విజయవాడ ఆగస్టు 17,
వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దు. ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్నచిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు, ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వినాయక చవితి సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ. పండుగలను,ప్రజలను ప్రభుత్వం మత,ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదు. వినాయక చవతి మతాలకు సంబంధించిన అంశం కాదు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని మతం కోణంలో చూస్తున్నట్లుంది. ఈ విషయంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచిది కాదు. దేశంలో ప్రతిష్టాత్మకమైనఖైరతాబాద్ వినాయకుడి ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఇతర అధికారులు ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రంజాన్ మాసంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభిప్రాయాలు ఇప్పుడు కూడా తీసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నాను. ఇటువంటి విప్రజలవిశ్వాసాలను,బాధ్యతను సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం హిందుమత పెద్దలు, స్వామీజీ లు, మఠాధిపతులతో చర్చించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదని అయన అన్నారు.