YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

మత్తడివాగును పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మత్తడివాగును పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కొమురం భీం ఆగస్టు 17,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత , నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా  వర్షాలు కురుస్తున్నాయి . వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి . నీటిప్రవాహం తగ్గే వరకు ప్రజలు రాకపోకలు చేయోద్దని అక్కడి ప్రజలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. లొతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తత ఉండాలని, చేపల వేటకు వెళ్లవద్దన్నారు . జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మేరగుడా, మత్తడివాగు ప్రాంతాలను అయన  పరిశీలించారు.  మత్తడి దాటి ఎవరు రాకపోకలు సాగించకుండా చూడలని తహశీల్దార్ రఘునాథ్ ను ఆదేశించారు.  వర్షకాలం వచ్చిందంటే ఒర్రెపై వంతన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు . ఒర్రెపై వంతన నిర్మాణానికి ప్రభుత్వాని ప్రతిపదనలు పంపిస్తామని ఈ సందర్బంగా కలెక్టర్ పెర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రఘు, ఆర్.ఐ సంతోష్ , ఎస్సై రమేష్ , సర్పంచ్ రాజన్న , ఎండి షరీఫ్ , గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.

Related Posts