విశాఖపట్నం ఆగస్టు 17,
విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ గా పనిచేస్తున్న మనీష్ కుమార్ సిన్హాను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ సీపీ గా బదిలీపై వచ్చిన మనీష్ కుమార్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రభుత్వం గుర్తించిన విశాఖలో శాంతి భద్రతల పై దృష్టి సారిస్తామని చెప్పారు.