న్యూఢిల్లీ ఆగస్టు 17,
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టీస్ బొబ్డే వ్యాఖ్యానించారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు కేసులు మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తం ఐదు కేసుల్లోనూ ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.