సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో నీ ఎస్ బి ఐ బ్యాంకు లో దుండగులు చోరికి యత్నించారు. స్ కటర్లతో కిటికీ గ్రిల్స్ తొలగించి లొపలికి వెళ్లి లాకర్ లను గ్యాస్ కట్టర్ తో ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. బయట ఉన్న జనరేటర్ ప్రాంతంలో కిటికీ గుండా లోపలికి ప్రవేశించారు అనంతరం లోపలికి వెళ్ళి గ్యాస్ కట్టర్ సహాయంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రయత్నం చేశారు . అది తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు అయితే ఆధారాలు దొరగకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు తర్వాత బ్యాంకు ఓపెన్ చేసిన అధికారులు . చోరీ జరిగిన విషయాన్ని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్టు చేపట్టారు.