YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్వర్ణ జయంతి సంవత్సరంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ జర్నలిస్ట్ సంఘం పిలుపు

స్వర్ణ జయంతి సంవత్సరంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ జర్నలిస్ట్ సంఘం పిలుపు

హైదరాబాద్ ఆగ‌స్టు 17 
జాతీయ స్థాయి లో జర్నలిస్టులు,వారి హక్కులు,సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ జర్నలిస్ట్ సంఘం 2021 సంవత్సరం స్వర్ణ జయంతి సంవత్సరంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎన్.యూ.జె. అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్  పురుషోత్తం నారగౌని తెలిపారు. ఎన్.యూజె(ఐ) మాజీ జాతీయ అధ్యక్షుడు, స్వర్ణ జయంతి వర్ష్ కమిటీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ , ఎన్.యూజె(ఐ) జాతీయ అధ్యక్షుడు మనోజ్ మిశ్రా, ప్రధాన కార్యదర్శి సురేష్ శర్మ, కోశాధికారి ఆమేరకు స్వర్ణ జయంతి సంవత్సరాన్ని  నిర్వహించాలని ప్రకటించారన్నారు. స్వర్ణ జయంతి సంవత్సర కార్యక్రమాల నిర్వహణ ,సమన్వయం కొరకు మాఖనలాల్ చతుర్వేది జర్నలిజం విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి  సీనియర్ జర్నలిస్ట్ అచ్యుతానందన్  మిశ్రా ను స్వర్ణ జయంతి వర్ష్  సమన్వయ కర్తగా నియమించినట్లు తెలిపారు. కమిటీలో మిశ్రాతో పాటు సమన్వయ కమిటీని నియమించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్వర్ణ జయంతి కార్యక్రమలు నిర్వహించనున్నట్లు  తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో స్వర్ణ జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.

Related Posts