YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం గ‌ణేశ్ వేడుక‌లు నిర్వ‌హించుకోవాలి

ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం గ‌ణేశ్ వేడుక‌లు నిర్వ‌హించుకోవాలి

హైద‌రాబాద్ ఆగష్టు 17 
కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ కీల‌క సూచ‌న చేశారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ర‌ద్దీ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ విగ్ర‌హాలు పెట్ట‌డానికి, వేడుక‌లు నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌ణేశ్, మొహ‌ర్రం వేడుక‌ల‌ను ఇంట్లోనే నిర్వ‌హించుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఎవ‌రి ఇంట్లో వారే వినాయ‌క పూజ చేసుకుని మీతో పాటు మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల‌ని కోరారు. పోలీసులంద‌రూ మీ ఆరోగ్యం, ర‌క్ష‌ణ కోసం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని సీపీ తెలిపారు. మీకు మీరు ర‌క్ష‌ణ‌గా ఉంటూ.. న‌గ‌రాన్ని సుర‌క్షితంగా ఉంచాల‌ని సీపీ అంజ‌నీ కుమార్ పిలుపునిచ్చారు.కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో వినా‌య‌క‌చ‌వితి, మొహర్రం పండు‌గ‌లను ఇంట్లోనే నిర్వ‌హిం‌చు‌కో‌వా‌లని అటవీ, పర్యా‌వ‌రణ, దేవా‌దా‌య‌శా‌ఖల మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌‌రెడ్డి నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆది‌వారం క్యాంప్‌ కార్యా‌ల‌యంలో మీడి‌యాతో మాట్లా‌డుతూ.. గణ‌పతి ఉత్స‌వా‌లను, మొహర్రం పండు‌గను నిరా‌డం‌బ‌రంగా నిర్వ‌హిం‌చా‌లని ప్రభుత్వం నిర్ణ‌యిం‌చిం‌దని చెప్పారు. కొవిడ్‌–19 నిబం‌ధ‌నలు పాటిస్తూ పక్క‌వా‌రికి ఇబ్బంది కలు‌గ‌కుండా, ఎక్కువ జనం గుమి‌గూ‌డ‌కుండా పండు‌గ‌లను ఎవ‌రింట్లో వాళ్లే జరు‌పు‌కో‌వా‌లని, సామూ‌హిక నిమ‌జ్జ‌నాలు, ప్రార్థ‌నలు వద్దని సూచిం‌చారు. కరోనా బారిన పడ‌కుండా ఉండేం‌దుకు పండు‌గలు, ఉత్స‌వాల సమ‌యంలో ప్రజలు నిబం‌ధ‌నలు పాటిస్తూ ప్రభు‌త్వా‌నికి సహ‌క‌రిం‌చా‌లని మంత్రి విజ్ఞ‌ప్తి‌చే‌శారు.

Related Posts