YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉస్మానియా పై హైకోర్టులో విచారణ ఈనెల 24 కు వాయిదా

ఉస్మానియా పై హైకోర్టులో విచారణ ఈనెల 24 కు వాయిదా

హైదరాబాద్ ఆగస్టు 17 
ఉస్మానియా ఆస్పత్రి అంశంపై హైకోర్టులో  సోమవారం విచారణ జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని.. రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని అడ్వకేట్ జనరల్  కోర్టుకు తెలిపారు. వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూసామని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని,  మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారణ జరుపుతామని  హైకోర్టు సీజే ధర్మాసనం వెల్లడించింది. పురావస్తు భావనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి అన్నారు. మరో కౌన్సిల్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని బెంచ్ కు తెలిపారు. పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారని, ఎన్నో వ్యాజ్యాలు వేశారని ఇప్పటికీ హైకోర్టులో  ఇతర అంశాలపై రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు విచారణ దశలో ఉన్నాయని కోర్టుకు  న్యాయవాది రచనారెడ్డి తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తరువాత విచారణ ఈ నెల 24 కు వాయిదా వేసింది.

Related Posts