YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శివుడు_అర్థమైతే_సత్యం_అర్థమవుతుంది

శివుడు_అర్థమైతే_సత్యం_అర్థమవుతుంది

గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.
“ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ – చిన్న గానీ – సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు – అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది. అట్టి శివ తత్వం లోని కొన్ని విషయాలని పరిశీలిద్దాం.
1. జ్యోతిర్లింగాలు: .శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…( జ్ఞానాన్ని) ప్రసాదించేది.
2.లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.
3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడు గా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయము లకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం.స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ ( మనసు), కారణ ( అజ్ఞానం)శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివుని లో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.
4. శివ,విష్ణు,బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.
5. మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలం లో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ హరతికి…. ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.
6. పంచభూత లింగాలు : దక్షిణ భారతం లోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం ,జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కానిదింకేమైనా ఉందా ?
7. శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.
8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )
9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ ,మనన, నిధి,ధ్యాసాలు (ధ్యానం) .
10. అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ,స్థితి, మరణం -ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.

Related Posts