మీరు చదవండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి
రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అనీ అనుకోవచ్చు..కానీ నిజం..
రోగ నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉన్నాయి.
అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది
ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది
మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..
అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం,
బలం లభిస్తుంది..
ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు,
తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు..
ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...
1. నారాయణయం
(ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన )
ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.
ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, (you tube vedio audio లభిస్తుంది) కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది...
చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..
2. వైద్యనాద్ స్త్రోత్రం
శివయ్య గొప్ప వైద్యుడు కూడా
పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు
ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం,
శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి, సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అభిషేకం చేయాలి,
ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో
ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు
అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి హారతి ఇవ్వాలి ,
కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి..
తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి
చెరువు అయినా పర్వాలేదు...
అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి
చాలా ఉపశమనం లభిస్తుంది..
ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి
మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో
అభిషేకం చేయించండి...
3.చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం,
వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి
కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి ప్రదర్శన,
హనుమాన్ చాలీసా రోజు చదవడం..!
4. రాహుకాలం లో దుర్గా దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.
5. ఏ ఔషధం సేవిస్తున్న కూడా
"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే
ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.!
6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది.రోజూ ఐదు తులసి ఆకులు తినండి,
కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.
తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది,
రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవుకి కూడా.
అవకాశం ఉన్న వారు కాసేపు గోశాలలో గడపండి..
వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే
త్వరగా గుణం ఉంటుంది.