YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పూజ్యగురుదేవులు డాక్టర్ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆణిముత్యాలు అయిన వాక్కులు వివిధ ప్రవచనముల నుంచి సేకరణ..

పూజ్యగురుదేవులు డాక్టర్ బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆణిముత్యాలు అయిన వాక్కులు  వివిధ ప్రవచనముల నుంచి సేకరణ..

????భారతదేశంలో ప్రతినేల ఒక క్షేత్రం  ప్రతి నీరు ఒక తీర్థం.
????భారతదేశం నా హృదయం అనే భావన ప్రతీ భారతీయునికి కలగాలి.
????హిందూధర్మం లో ఎంత సంపాదించావు అని కాదు ఎలా సంపాదించావు అన్నది ముఖ్యం..
???? అధికారం జ్ఞానం ముందు తల వంచాలి కానీ అధికారం ముందు జ్ఞానం తలవంచరాదు. అప్పుడే దేశం క్షేమంగా ఉంటుంది.
????శాస్త్రం నిర్దేశించినది ధర్మము. ధర్మానికి కట్టుబడినప్పుడు తత్కాలంగా కష్టం అనిపించినా పరిణామంలో శాంతి లభిస్తుంది.
????పూర్వకాలంలో భారతదేశంలో ధర్మాన్ని అనుసరించి చట్టాలను చేసేవారు. ఆ చట్టం చెప్పేది న్యాయంగా వ్యవహరింపబడేది.
ధర్మానికి, న్యాయానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు ఏది ముఖ్యం అనే సందేహం కలిగితే విచక్షణ కలిగిన వారు న్యాయం కంటే ధర్మమే గొప్పది అనే నిర్ణయానికి రావాలి. 
????తల్లిదండ్రులను పిల్లలు సరిగా చూడకపోతే చట్టం శిక్షించదు, కానీ ధర్మశాస్త్రం శిక్షిస్తుంది. అతనికి తప్పకుండా సద్గతులు ఉండవు అని శాసిస్తుంది.
????చట్టం పట్టించుకోని పాపాలను ధర్మం పట్టించుకోని శిక్షిస్తుంది.
చట్టం దృష్టి పరిమితం, ధర్మం యొక్క దృష్టి అనంతం.
????కేవలం కామం అనే వికారం చేతనే ధర్మాన్ని అతిక్రమించడం జరుగుతూ ఉంటుంది. కానీ ధర్మం దానిని కూడా ధర్మబద్ధంగా నిర్వహించుతుంది. దానిని బట్టి దంపతీ ధర్మం ఏర్పడింది.
????పిల్లలలో నైతిక బలం ఏర్పడాలంటే తల్లిదండ్రులలో నీతి ఉండాలి.
ధర్మబద్ధంగా స్త్రీపురుషులు నిబద్ధులై ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కుటుంబ వ్యవస్థలో పవిత్రత అనేది ఉంటుంది.
????స్త్రీకి పాతివ్రత్యం, పురుషునికి ఏకపత్నీవ్రతం అనేది భారతీయ సంస్కృతి తతతరాల ప్రయోగాలతో సాధించుకున్న గొప్ప ఆదర్శం. ఆ ఆదర్శన్నే రామాయణం మనకు అందిస్తూ ఉన్నది.
????ఇంద్రియ భోగముల వల్ల శక్తి క్షీణిస్తుంది అని యోగశాస్త్రం చెప్తున్నటువంటి అంశం.
????ఎప్పుడైతే ధర్మాన్ని పాలనా వ్యవస్థ నుంచి దూరం చేశారో అప్పుడు లౌకిక రాజ్యం అనే పేరుతో ధర్మం అవసరం లేనటువంటి విధానాలు ఏర్పడ్డాయి.
????ధర్మం కేవలం ఒకానొక మతసంబంధమైన విషయం అని భావించడంవల్ల వచ్చిన పొరపాటు ఇది.
ధర్మం మతానికి సంబంధించినది కాదు, జీవితానికి సంబంధించినది.
????తత్కాల సుఖాల కోసం శాశ్వతమైన ధర్మాన్ని పరిత్యజిస్తే శాశ్వతమైన దుఃఖాన్ని పొందవలసి వస్తుంది అని ధర్మం శాసిస్తోంది. అంత లోతైన అవగాహన చట్టానికి, న్యాయానికి ఉండదు.
ధర్మవేత్తలు ధర్మాన్ని ప్రజలకు తెలియజేయాలి, ధర్మబద్ధంగా మనం జీవించాలి.
????మనం చేసినది చట్టపరంగా ఈరోజు నేరం కానప్పటికీ ధర్మపరంగా తప్పే అని తెలిసినప్పుడు తప్పు చేయకుండా ఉండాలి, ఆ తప్పు నుంచి బయటపడాలి.
????ధర్మాన్ని అనుసరించిన జీవితం ప్రజలకు చేరువ చేయాలి. అలా చేయడంలో ధర్మశాస్త్రవేత్తలు, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసిన వారు దానికై కృషి చేయాలి.
????భారతీయ వైవాహిక ధర్మంలో దంపతీ ధర్మానికి ఉన్నటువంటి పవిత్రతను పరిశీలించాలి.
????అద్భుతమైన దాంపత్య ధర్మం యుగాల క్రితమే ప్రతిపాదించిన వేదధర్మం ఎంత గొప్పదో గ్రహిస్తూ దానిని మనం నిలబెట్టుకొని దానివల్లనే భారతదేశం పట్ల విదేశీయులకు కూడా గౌరవం ఉన్నది అని తెలుసుకొని ఆ గౌరవాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేద్దాం.

Related Posts