YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

త్రిపురలో బీజేపీకి కష్టకాలం

త్రిపురలో బీజేపీకి కష్టకాలం

న్యూఢిల్లీ, ఆగస్టు 18, 
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించిన ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర సంకీర్ణ సర్కారులో అప్పుడే లుకలుకలు మెుదలయ్యాయి. సీపీఎం కు కంచుకోట లాంటి ఈ రాష్ట్రంలో 2018 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయదుందుభి మోగించింది. పాతికేళ్ళపాటు పాలించిన వామపక్ష సర్కారును అనుాహ్యంగా ఓడించి కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సీపీఎం అధినేత మాలిక్ సర్కార్ ను ఓడించి బీజేపీ నాయకుడు విప్లవ్ కుమార్ దేవ్ అగర్తలా అధికార పీఠాన్ని అధిష్టించారు. నాటి ఎన్నికల్లో మెుత్తం 60 స్ధానాలకు 35 స్ధానాలను సాధించి తొలిసారి కమలం కాషాయజెండాను రెపరెపలాడించింది. 16 స్ధానాలతో సి.పి.ఎం రెండో స్ధానాన్ని సాధించగా 8 స్ధానాలతో ఐ.పి.టి.ఎఫ్ ముాడోస్ధానంలో నిలిచింది. హస్తం పార్టీ కనీసం ఒకస్ధానాన్ని కుాడా సాధించలేకపోయింది. కమలం ఐ.పి.టి.ఎఫ్ పార్టీ సర్కార్ ఏర్పటైంది.చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికి దాదాపు రెండున్నరేళ్ళుగా సంకీర్ణ సర్కారు సజావుగానే నడుస్తోంది. 8 స్ధానాలుగల ఐ.పి.టి.ఎఫ్ కి రెండు మంత్రి పదవులను కేటాయించారు. ఆ పార్టీ అధినేత ఎన్.సి దెబర్మ కు కీలకమైన రెవెన్యుా శాఖను కేటాయించారు. ఆ పార్టీకి చెందిన మరోనాయకుడు మేవకుమార్ జమటియాకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖ లభించింది. ఏడాది అనంతరం బీజేపీ, ఐ.పి.ఎఫ్.టి ల మధ్య విబేదాలు మెుదలయ్యాయి .2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నకల్లో విడివిడిగా పోటీ చేశాయి. అయినప్పటికి రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్ధానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు, దేశవ్యాప్తంగా విజయ దుందుభి మోగించడం అసెంబ్లీలో మిత్రపక్షంతో సంబంధం లేకుండా సంపూర్ణ ఆధిక్యం (35 స్ధానాలు ఉండటంతో సహజంగానే కమలం నేతలు మిత్రపక్షం పట్ల ఒకింత ఊదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. దీనికితోడు పౌరసత్వసవరణ చట్టం (సి.ఎ.ఎ) రెండు పార్టీల మధ్యవిభేదాలను మరింత తీవ్రతరం చేసింది.ఐ.పి.ఎఫ్.టి పూర్తిగా గిరిజనుల ఆధిక్యం గల ప్రాంతాల్లో పట్టున్న పార్టీ వల్ల తమ అస్ధిత్వం దెబ్బ తింటుదని ఐ.పి.ఎఫ్.టి ఆందోళన చెందుతోంది. గిరిజన భాష అయిన కొక్బరోక్ ను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో చేర్చాలని పట్టుబడుతోంది. అంతేగాక వచ్చే సర్కారులో సి.ఎమ పదవి గిరిజనుడికే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ఇటీవల జరిగిన అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఎన్నికల్లోనుా రెండు పార్టీల మద్య విభేదాలు బట్టబయలయ్యాయి. గిరిజనుల సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకుడిని ఇటీవల అరెస్టు చేయడంపైన ఐ.పి.టి.ఎఫ్ అధినేత, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.సి దెబర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి అనేక హామీలిచ్చిన బీజేపీ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ విస్మరించినా గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్షంగా ఏర్నడిన తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన ‍హెచ్చరించారు. పౌరసత్వసవరణ చట్టం , జాతీయ పౌరపట్టిక ను ఒక్క త్రిపురే కాదని యావత్ ఈశాన్యభారతం వ్యతిరేకిస్తుందని ఆయన హెచ్చరించారు. త్రిపుర లో ఆరో షెడ్యూల్ అమలవుతున్నందున గిరిజన ప్రాంతాల్లో సి.ఎఎ ను అమలుచేయవద్దని దెబర్మ డిమాండ్ చేశారు.బీజేపీ ఎమ్ఎల్ఎ రెబటె త్రిపుర బంధువు కారుపై ఇటీవల దుర్గాపూర్ లో దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమెాదవ్వగా ఇద్దరిని అరెస్టుచేశారు. ఇది ఐ.పి.ఎఫ్.టి పనే అని కమలం ఆరోపిస్తోంది. ఆ పార్టీని విపక్ష సి.పి.ఎం తప్పు దోవపట్టిస్తోందన్నది బీజేపీ ఆరోపణ. మెుత్తం మీద ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎంతోకాలం సంకీర్ణ సర్కారులో ఐ.పి.ఎఫ్.టి కొనసాగే పరిస్ధితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.బీజేపీ వాదన భిన్నంగా ఉంది. 35 స్ధానలతో అసెంబ్లీ లో తమకు సంపూర్ణ ఆధిక్యం ఉందని, అయినప్పటికీ ఐ.పి.టి.ఎఫ్ కు రెండు మంత్రి పదవులు కేటాయించామని కమలం పార్టీ గుర్తుచేస్తోంది. అదేసమయంలో కీలకమైన రెవెన్యూ శఖను కేటాయించామని, ఈ విషయాన్ని విస్మరించరాదని చెబుతోంది. సి.ఎ.ఎ, ఎన్.ఆర్.సి ల వల్ల నిజమైన పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొంటోంది. గిరిజనులకు ఒక్క ఐ.పి.ఎఫ్.టి మాత్రమే ప్రాతినిధ్యం వహించలేదని, తమకు గిరిజనుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేసింది. ఈ పరిస్ధితుల్లో మున్ముందు ఏంజరుగుతుందో వేచిచూడాలి.

Related Posts