YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఎమ్మెల్యే గణేష్ బాబు అలక

టీడీపీ ఎమ్మెల్యే గణేష్ బాబు అలక

విశాఖపట్టణం, ఆగస్టు 18,
అసలే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఉన్న కొద్దిమందిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయకపోగా, తమ చర్యలతో వారు మనస్తాపానికి గురయ్యేటట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం తెలుుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే విశాఖ నగరంలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు రాజధానిని వ్యతిరేకించే సాహసం చేయడం లేదు. అయితే ఇదంతా పక్కన పెడితే విశాఖ కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన పూర్తి పేరు పీవీజీఆర్ నాయుడు. ఈ పేరు ఎవరికీ తెలియదు. గణబాబు అంటేనే అందరికీ సుపరిచితం. గణబాబు జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు. ఆయన తండ్రి అప్పలనరసింహం ఎంపీగా పనిచేశారు. తండ్రి మరణంతో గణబాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరిన గణబాబు 2014, 2019 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జగన్ హవా ఉన్నప్పటికీ గణబాబు జైత్రయాత్ర పశ్చిమ నియోజకవర్గంలో ఆగలేదు.ఎల్జీ పాలిమర్స్ ఘటనతో….ఇక తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకునే నేతల్లో గణబాబు ఒకరు. నియోజవర్గంలో కూడా ప్రజలకు చేరువగా ఉంటారన్న పేరుంది. ఇటీవల గ్యాస్ లీక్ అయి 13 మంది మరణించిన ఎల్జీ పాలిమర్స్ కూడా గణబాబు నియోజకవర్గంలోనే ఉంటుంది. చంద్రబాబు ఈ సంఘటనలో బాధితులను పరామర్శించేందుకు విశాఖ వస్తామని రాలేదు. కానీ మృతుల కుటుంబాలకు పార్టీ తరుపున యాభైవేలు చొప్పున అందచేశారు.లోకేష్ కనీసం ఆగకుండా……అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్లారు. తన నియోజకవర్గం మీద నుంచి వెళుతూ కనీసం ఇక్కడ గ్యాస్ లీక్ బాధితులను లోకేష్ పరామర్శించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్గమధ్యంలో ఉన్న తమ నియోజకవర్గంలో లోకేష్ ఆగడకపోవడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. తనపై పార్టీ అధినాయకత్వం చిన్నచూపు చూస్తుందన్న భావనలో ఉన్నారు. అందుకే గణబాబు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయకుండా ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారు.

Related Posts