YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీ టెక్ రవి....కిం కర్తవ్యం

బీ టెక్ రవి....కిం కర్తవ్యం

కడప, ఆగస్టు 18, 
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా పదిహేను రోజులు దాటింది. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండానే బీటెక్ రవి ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ పార్టీలో జరగడమే ఇందుకుకారణం. బీటెక్ రవి ప్రత్యర్థులతో కుమ్మక్కై రాజీనామా చేశారని కూడా టీడీపీలో కొందరు నేతలు అనుమానిస్తుండటం విశేషం. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీ నిర్ణయం కాదని బీటెక్ రవి చెప్పినప్పటికీ ఆయన రాజీనామాలకు గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు.నిజానికి బీటెక్ రవి సీరియస్ నేత కాదు. 2011 పులివెందులలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మిపై పోటీ చేసేందుకు అప్పట్లో సతీష్ రెడ్డి ముందుకు రాలేదు. దీంతో అప్పటికప్పుడు బీటెక్ రవిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. ఓటమి పాలయిన తర్వాత మళ్లీ ఆయన కనపడలేదు. తర్వాత కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీటెక్ రవి ముందుకు వచ్చారు. బీటెక్ రవి తొలి నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనుచరుడిగా ఉన్నారు.అందుకే బీటెక్ రవికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి దక్కింది. సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణదీక్ష చేస్తున్న సమయంలోనూ ఆయన కూడా దీక్ష చేశారు. అంతకు మించి కడప రాజకీయాల్లో బీటెక్ రవి ఎప్పుడూ క్రియాశీలకంగా లేరు. కానీ రాజధాని అమరావతి విషయంలో బీటెక్ రవి రాజీనామా చేయడం వెనక ప్రత్యర్థుల వ్యూహం ఉందన్నది టీడీపీ నేతల అనుమానం. ప్రధానంగా ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే రాజధానికి దగ్గరలో ఉన్న మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబు, బుద్దా వెంకన్న తదితరులంతా రాజధాని ప్రాంతానికి చెందిన వారేదీంతో వారందరినీ ఇరకాటంలో పడేసేందుకు బీటెక్ రవి రాజీనామా చేశారంటున్నారు. రాజీనామా చేసి మరీ అమరావతికి వచ్చి రైతులకు సంఘీభావం తెలపడం కూడాచర్చనీయాంశంగా మారింది. బీటెక్ రవి వ్యవహారం పార్టీ నేతలకే తలనొప్పిగా తయారయిందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకీ బీటెక్ రవి తన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ కు పంపారా? లేదా? అన్నది కూడా అనుమానమేనంటున్నారు. మొత్తానికి బీటెక్ రవి తన రాజీనామాతో అధికారపార్టీ కంటే సొంత పార్టీనే ఎక్కువగా ఇబ్బందుల్లోకి నెట్టారంటున్నారు.

Related Posts