YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు లేఖలపై చర్చోపచర్చలు

చంద్రబాబు లేఖలపై చర్చోపచర్చలు

గుంటూరు, ఆగస్టు 18, 
ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వారే ఆపద్భాంధువుల్లా కన్పిస్తారు. చంద్రబాబు ఇప్పుడు పూర్తి ఫ్రస్టేషన్ లో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేస్తుంది. అక్రమ కేసులను టీడీపీ నేతలపై బనాయిస్తుంది. పార్టీ నేతలకు కండువా కప్పేస్తుంది. తన కలల రాజధాని అమరావతిని కదలించేస్తుంది. మరోవైపు పార్టీ నేతలు కూడా తనకు సహకరించడం లేదు. చంద్రబాబు ఫ్రస్టేషన్ కు ఇవన్నీ కారణాలుగా చెప్పాలి.కానీ ఇప్పుడు జగన్ ను నిలువరించేవారు ఎవ్వరూ లేరు. ఒక్క కేంద్ర ప్రభుత్వం తప్ప. అందుకే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి మరీ వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాస్వామ్యం మనుగడ ఏపీలో ప్రశ్నార్థకమయిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని నిఘా సంస్థలతో విచారణ జరపాలని చంద్రబాబు కోరతున్నారు. మోదీని తాను గత ఎన్నికలకు ముందు వ్యతిరేకించినా అదే మోదీ తప్ప ఇప్పుడు తనను, తన పార్టీని రక్షించలేరన్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలిసివచ్చింది.ఎంతమాట.. ఎంత మాట.. ఏడాదిలోనే టోన్ లో ఎంత మార్పు. మోదీ నాయకత్వం శక్తిమంతమైందట. సమర్థవంతమైందట. మోదీ నాయకత్వంలో దేశ భద్రత ఇనుమడించిందట. అంతర్గత ఉగ్రవాదుల ముప్పు తగ్గిందట. విదేశీ సరిహద్దులు బలోపేతం అయ్యాయట. భారత సాయుధ దళాల్లో విశ్వాసం పెరిగిందట. ఈ మాటలను అన్నది ఎవరో కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు. స్వయంగా మోదీకి రాసిన లేఖలో ఆయన ఈ ప్రశంసలు కురిపించారు. అదే సయమంలో దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలని చంద్రబాబు రాసిన లేఖలో కోరారు.తాజాగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశమైంది. చంద్రబాబు లేఖకు మోదీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లేఖను ఏ మేరకు పట్టించుకుంటుందన్నది ప్రశ్నార్థకమే. ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబు లేఖకు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు విలువ ఇస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు దీనిపై రాష్ట్ర బీజేపీ ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోదని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు మోదీకి చేరువవ్వాలని లేఖలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ, ఏపీలో జరుగుతున్న పరిణామాలను తన లేఖ ద్వారా తెలియజేశారంటున్నారు.

Related Posts