మైలవరం ఆగస్టు 18,
కృష్ణ జిల్లా కేతనకొండ, కొటికలపూడి గ్రామాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. పెసర, పత్తి ,మినుము పంటలు అన్ని నీటమునిగాయి. అకాల వర్షాలతో రైతు చాలా నష్టపోయాడు. ఈ అకాల వర్షాల వల్ల రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులతో నష్టపోయిన పంటలను పరిశీలించి, నష్టం అంచనాలు వేసి, రైతులను ఆదుకోవాలి. 14 నెలలుగా రాజధాని ప్రాంతంలో ఒక్క రూపాయ కూడా కార్చుపెట్టకుండా తైతక్కలాడుతున్నారు. రైతులు రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం ' 33' వేల ఎకరాలు ఇస్తే ,ఈ తెలివిగల ముఖ్యమంత్రి అమరావతి అమ్మేస్తా అంటున్నాడని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన గ్రామాల్లో సరైన సమాచారం ఇవ్వకపోవడం వలన అకాల వరదలు గత ఏడాది ఇదే సమయంలో పితాని కోటేశ్వర రావు అనే వ్యక్తి వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా బాధాకరం. రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా గ్రామాలలో అలెర్ట్ చేయాలి ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చూడాలి. ఏడు దశాబ్దాల కల చిన్నపాటి వర్షం వస్తేనే గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి బాహ్య ప్రపంచానికి ఈ గ్రామాలకు సంబంధాలు లేకుండా పోయాయి. చంద్రబాబు నాయుడు కృషితో 5 కోట్లు తో కొటికలపూడి బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఇవాళ ఎంత వర్షం పడిన గ్రామాల్లో చక్కగా రాకపోకలు జరుగుతున్నాయని అయన అన్నారు. ఒక్కసారి ఒక్కసారి అని అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలను ఏడుపిస్తున్నాడు. పేదవాడి భూమి ఎకరా కోటి రూపాయలు అమ్మింది. ఇవాళ 25 లక్షలు కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. పేదవాడు మాత్రం నష్ట పోవాలి మనం మాత్రం విశాఖ పోయి భూములు అమ్ముకొని వందల కోట్లు సంపాదించాలి. పంచాయతీల్లో ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. వాలంటీర్లు ఉద్ధరించారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం ఉద్ధరించారు..? రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కుప్పగూల్చారు. పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టవయ్యా అంటే ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, నోబెల్ ప్రైజ్ అంటూ మద్యం బ్రాండులు తీసుకొచ్చావు. లిక్కర్ నాణ్యమైన బ్రాండ్ ను పక్కన పెట్టేసి, మీ నాయకులు కంపెనీలలో తయారుచేసిన నాసిరకం బ్రాండ్లను అమ్ముతున్నారు. ఎంత లోటు బడ్జెట్ లో కూడా పోలవరాన్ని 70% కట్టం, అమరావతి నిర్మించుకున్నాము. ఇవాళ 14 నెలలుగా అమరావతిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టలేదు. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా... 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయింది ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక విజయవాడ మధ్యన రాజధానికి మేం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పారా లేదా ? ఇప్పుడు పరిపాలన చేయడం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకోమంటున్నారు. పెద్ద ఎత్తున అమరావతి రాజధాని కోసం మహిళలు, వృద్ధులు ,చిన్నపిల్లలు, రైతులు అన్ని కులాల వారు ఉద్యమాలు చేస్తుంటే ..ఇవాళ ఒక కులానికి రాజధానిని ముడిపెట్టి ఉద్యమాలు చేస్తున్న వారిని పేయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారు. కృష్ణా నదిని తోడేసి ఇబ్రహీంపట్నం ట్రక్ టర్మినల్ వద్ద ఇసుక ను గుట్లగా పోసుకొని రాత్రిపూట అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఇష్టారాజ్యంగా చేసుకొని అమ్ముకుంటున్నారు. సెంటు పట్టా ఇస్తానని చెప్పి, జి కొండూరు గ్రామంలో రైల్వే ట్రాక్ పక్కన భూములను ప్రభుత్వం చేత కొనిపించి విజయవాడ వాలకు ఇళ్ల స్థలాలు ఇస్తాడంట... ఎంత గొప్ప వాడో స్థానిక ఎమ్మెల్యే అని విమర్శించారు. ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే బామ్మర్ది కలిసి షాబాద్ జక్కంపూడి, కొండపల్లి ప్రాంతాలలో పెద్ద పెద్ద కొండలను కొట్టేశారు. పోలవరం కాలువ గట్టున మట్టిని పోస్తే ఆ మట్టిని అమ్ముకున్నారని అయన ఆరోపించారు.