YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

రోగ నిరోధక శక్తి పై చిగురిస్తున్న ఆశలు.. !

రోగ నిరోధక శక్తి పై చిగురిస్తున్న ఆశలు.. !

వాషింగ్టన్‌ ఆగష్టు 18 
 హెర్డ్‌ ఇమ్యునిటీ అంటే ఏదైనా ఒక వ్యాధి జనాభాలోని ఒక పెద్ద భాగంలో వ్యాపిస్తే, మనుషుల్లోని రోగ నిరోధక శక్తి (ఇమ్యునిటీ పవర్‌)  ఆ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకునేందుకు సాయం చేస్తుంది. అంటే, జనాభా ఆ వ్యాధితో పోరాడి పూర్తిగా కోలుకోగలరు. వారు ఆ వ్యాధి నుంచి రక్షణ పొందుతారు. రోగ నిరోధక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే రోగనిరోధక కణాలు పెరుగుతాయి. క్రమంగా జనం ‘ఇమ్యూన్’ అయ్యే కొద్దీ, వైరస్ వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కరోనా రానివారికి, ఆ వ్యాధికి ఇమ్యూన్ కాని వారికి పరోక్షంగా రక్షణ లభిస్తుంది. అయితే, కరోనా వైరస్‌ విషయంలో ఇప్పటిదాకా ఈ హెర్డ్‌ ఇమ్యునిటీపై ఎన్నో అనుమానాలున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిన ఓ అంశం దీనిపై ఆశలు చిగురింపజేస్తున్నది. కరోనా వైరస్‌ రోగనిరోధక ప్రతిస్పందనలను నెలలకొద్దీ పర్యవేక్షిస్తున్న సైంటిస్టుల బృందం.. తేలికపాటి లక్షణాలున్న వ్యక్తులలో కూడా వారు కోలుకున్న తర్వాత  సార్స్‌ సీఓవీ--2కు శాశ్వత రోగనిరోధక శక్తి కనిపిస్తున్నదని తేల్చారు. అంటే కొవిడ్‌తో కోలుకున్న రోగుల్లో కొన్ని నెలల తర్వాత కూడా కరోనా వైరస్‌ను గుర్తించే బీ సెల్స్‌, టీ సెల్స్‌ కొనసాగుతున్నాయని గుర్తించారు. దీంతో టీకా వస్తే తప్ప హెర్డ్‌ ఇమ్యునిటీ సాధ్యం కాదనే భావన తప్పని తేల్చారు. ‘ఇది మీరు కోరుకునేదే.. కొవిడ్‌తో కోలుకున్న రోగుల్లో రక్షణాత్మక రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి.’ అని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజిస్ట్‌, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మారియన్‌ పెప్పర్‌ పేర్కొన్నారు. ఈ రోగనిరోధక ప్రతిస్పందనలు ఎంతకాలం ఉంటాయో తెలియనప్పటికీ కరోనా వైరస్‌ సంక్రమణను ప్రస్తుతం అడ్డుకోగలవని చెప్పారు. అయితే, కరోనాబారినపడి కోలుకున్నవారు రెండోసారి మహమ్మారి బారినపడలేదని తేలేంతవరకూ ఈ హెర్డ్‌ ఇమ్యునిటీపై తుది నిర్ధారణకు రాలేమన్నారు. కాగా, ఈ అధ్యయన ఫలితాలు రోగనిరోధక వ్యవస్థను మోసగించగల వైరస్ సామర్థ్యంపై బహిర్గతమైన ఇటీవలి ఆందోళనలను అరికట్టడానికి సహాయపడతాయని, టీకా తయారీలోనూ ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related Posts