YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భర్త శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి ప్రియుడితో సహజీవనం

భర్త శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి ప్రియుడితో సహజీవనం

గుంటూరు, ఆగస్టు 18 
భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. అనంతరం కొల్లూరులో ప్రియుడితో సహజీవనం చేస్తూ పోలీసులకు పట్టుబడింది.ప్రియుడి మోజులో పడిన వివాహిత కట్టుకున్న భర్తనే దారుణంగా చంపేసి ఇంట్లోనే పూడ్చివేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 3 నెలలుగా తన కొడుకు చిరంజీవి కనిపించటం లేదంటూ బల్లేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి వారం రోజుల క్రితం చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిరంజీవి భార్యపై ఆరా తీయగా ఆమె ఓ వ్యక్తితో కొల్లూరు గ్రామంలో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.చెరుకుపల్లి మండల కేంద్రానికి చెందిన చిరంజీవి కొల్లూరు గ్రామంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. మనస్పర్థల కారణంగా మొదటి భార్యతో విడిపోయిన అతడు ఇంటూరుకు చెందిన మహిళను ఆరేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. చిరంజీవి ఏదైనా పనిమీద బయటకు వెళ్లిన సమయంలో భార్య మెడికల్ షాపు నిర్వహించేది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన చిరంజీవి స్నేహితుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో ఆమె ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది.ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం చిరంజీవి స్థలాన్ని అమ్మి రూ.20లక్షలు తెచ్చి బీరువాలో పెట్టాడు. ఎప్పటినుంచో భర్తను వదిలించుకుని ప్రియుడితో బ్రతకాలనుకుంటున్న ఆమె దాన్ని అవకాశంగా తీసుకుంది. అదే రోజు ప్రియుడి సాయంతో భర్తను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టేసింది. అనంతరం రూ.20లక్షలు తీసుకుని ప్రియుడితో కలసి కొల్లూరులో కాపురం పెట్టింది. కొడుకు కనిపించకపోవడం, కోడలి ఆచూకీ లేకపోవడంతో అతడి తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.చిరంజీవి శవాన్ని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇలాంటి ఘటన జరగడంపై అందరూ షాకవుతున్నారు. చిరంజీవి శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని రేపల్లె రూరల్‌ సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Related Posts