శంషాబాద్ ఆగస్టు 18
ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నిందితుడిని సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు కేసులకు సంబంధించి నిందితుడి వద్దనుంచి 7 తులాల బంగారు, 6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎసిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కు చెందిన ముదావత్ రవినాయక్ సరూర్ నగర్ లో నివాసం ఉంటూ హోంగార్డుగా పనిచేసేవాడు. మాదాపూర్ పిఎస్ లో పనిచేస్తూ చెడువ్యసనాలకు బానిసై స్నాచింగ్ లకు పాల్పడుతూ పట్టుబడి గతంలోనే జైలుకు వెళ్లాడు. జైలుశిక్ష పడిన రవినాయక్ కు ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు. మరో గుర్తుతెలియని మహిళ తోకలసి శంషాబాద్ లో స్నాచింగ్ లకు పాల్పడిన రవినాయక్ ను ఎస్ఓటి పోలీసుల తో కలిసి అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు. శంషాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల పిఎస్ ల పరిధిలో నిందితుడు రవినాయక్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు శంషాబాద్ ఎసిపి వెల్లడించారు.