హైదరాబాద్ ఆగస్టు 19
ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. పోలీసు అంటే క్రైం జరిగినప్పుడు మాత్రమే వస్తారు అనుకునే వాన్ని.. కానీ ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం రక్షక భటులు గా పనిచేస్తున్నారని సినీ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. మంగళవారం నాడు అయన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ లో మీడియాతో మాట్లాడారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన సజ్జనార్ కు సెల్యూట్. ప్లాస్మా డొనర్స్ రియల్ హీరోస్. త్వరలో నేను కూడా ప్లాస్మా డొనేట్ చేస్తాను. ప్లాస్మా డొనర్స్ కుటుంబ సభ్యులు భయపడవలసిన అవసరం లేదు. అందరం చేతులు కలిపితే కరోనా ను కట్టడి చేయగలం. డాక్టర్ల చేతిలో బ్రహ్మాస్త్రం ప్లాస్మా. కోవిడ్ బలమైన వైరస్ కాదు. చాలా బలహీనమైనది. ఎవరూ ఊహించకుండా వచ్చింది కరోనా. పబ్లిక్ లో ఉన్న భయం తగ్గించాలి. ఆదే టైంలో జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ జాగ్రత్తగా ఉంటూ ఆవిరి తీసుకోవడం, బ్రీతింగ్ వ్యాయామం చేయడం వలన కరోనా ను తగ్గించుకోవచ్చని అయన అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ప్లాస్మా డోనేషన్ పై ఉన్న అపోహలను తొలగించడం కోసం ఒక పాటను రూపొందించాం. రాజమౌళి ఫ్యామిలీ తో పాటు మా ఫ్యామిలీ కీ కూడా కరోనా సోకింది. ప్లాస్మా అనేది సంజీవని లాంటిది. ప్లాస్మా దాతలను ప్రాణదాతలని పిలవాలి. మా ఫ్యామిలీ మొత్తం ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ లో 481 మంది ఇప్పటి వరకు ప్లాస్మా ను డొనేట్ చేశారు. వీరి ద్వారా 550 మందికి ప్లాస్మా ను అందించి కరోనా నుండి కాపాడుకోగలిగాం. రాజమౌళి లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తా అనడం కరోనా వచ్చి కోలుకున్న వారిలో స్పూర్తి నింపింది. ప్రజలలో అపోహలు ఉన్నాయి.. వారిలో ఉన్న అపోహలు తొలగించడానికి కృషి చేస్తున్నాం. పబ్లిక్ లో అవేర్ నెస్ తీసుకురావడం కోసం కీరవాణి టీం తో మంచి పాటను రూపొందించాం. ప్లాస్మా యోదులు, వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు.