YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2,400 ఏళ్ల తరువాత ఈజిప్టు మమ్మీ

2,400 ఏళ్ల తరువాత ఈజిప్టు మమ్మీ

జైపూర్‌ ఆగష్టు 18 
జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో 2,400 ఏళ్ల వయస్సు గల మమ్మీని వరదలో మునిగిపోకుండా ఉండడానికి గత 130 సంవత్సరాల తరువాత మొదటిసారి పెట్టె నుంచి బయటకు తీశారు. ఆగస్టు 14న జైపూర్‌లో కురిసిన వర్షాలకు మ్యూజియంలోకి నీరు ప్రవేశించింది. వరదనీరు మోకాలి లోతుకు చేరుకోవడంతో పెట్టెలో భద్రపరిచిన  మమ్మీని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ చోలాక్ తెలిపారు. ఆలస్యమైతే ఈజిప్ట్ నుంచి రాజస్థాన్‌కు 130 ఏండ్ల క్రితం తెచ్చిన ఈ మమ్మీ శాశ్వతంగా నాశనం అయ్యేదని ఆయన తెలిపారు. అందువల్ల గాజు పెట్టెను పగులగొట్టి మమ్మీని సురక్షిత ప్రదేశంలో ఉంచామని ఆయన తెలిపారు.

Related Posts