అమరావతి ఆగష్టు 18
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా పూర్తి స్ధాయిలో ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారు. ఆయన పలు జిల్లాల కలెక్లర్లతో మాట్లాడుతూ ప్రధానంగా వరద ప్రభావం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటుందని, వారిని నిత్యం నిత్యావసర సరుకులను అందించి, సహాయ శిబిరాల్లోకి తరలించాలని సూచించారు. వీటన్నింటిలోనూ కోవిద్ సూచనలను తప్పకుండా పాటించాలని నిర్థేశించారు.ఏపీ ప్రభుత్వానికి ఇళ్ల పట్టాల విషయంలో మరో షాక్ గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముమ్మరంగా సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. గోదావరి వరదలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్, పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వరద బాధితులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున వరద సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వరద సమయంలో బాధితులకు అందించే సాయం యధావిధిగా ఇస్తూనే ఈ 2000 ఆర్థిక సాయాన్ని అదనంగా అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ప్రజల సమస్యలు తీర్చేలా చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. నీరు, పరిశుభ్రత, ఆహారం, వసతులు ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.