అమరావతి ఆగష్టు 18
విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యా సంస్థల పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది. భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వ అంతేగాక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.