శంషాబాద్ ఆగస్టు 18,
శంషాబాద్ లో మరో దిశాలాంటి కేసు చోటు చేసుకుంది. బుధవారం ఉదయం మెడికో స్టూడెంట్ ప్రియాంక బెంగళూరు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వందే భారత్ విచారణ ఫ్లైట్ లో వచ్చింది. లగేజీ ఎక్కువగా ఉండడంతో బస్ లో వెళ్దాం అని అనుకుని శంషాబాద్ పట్టణం లోకి వచ్చి బస్ టికెట్ బుక్ చేసింది. ఆమె వెళ్లవలసిన బస్సు సమయానికి రాలేదు. దాంతో ఆమె శంషాబాద్ లోనే వుండిపోయింది. ఇంతలోనే ఆమె దగ్గరికి ముగ్గురు వ్యక్తలు వచ్చి ఆమె తో మాటలు కలిపారు. ఇక్కడ దగ్గరలో వీజేఆర్ హోటల్ ఉంది. మీరు ఆ హోటల్ లో వేయిట్ చేయండని ఆమె కు చెప్పారు. దాంతో ఆమె హోటల్ గురించి విచారణ చేసి దాంట్లో రూమ్ బుక్ చేసుకుంది. ఆమె హోటల్ రూమ్ లో ఉండగా ఆ ముగ్గురు వ్యక్లు తలుపులు కొట్టారు. ఆమె తో మాట్లాడి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని ఆమె కు ఫోన్ చేయడం, మెసేజిలు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో ఆమె కు అనుమానం వచ్చి ఆమె అన్నయ్యకు ఫోన్ చేసింది. ఆతను శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు హోటల్ నుండి పారిపోయారు. ఫోన్ నెంబర్ల ఆధారంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులు ప్రవీణ్ కుమార్, పూర్ణాంగి కుమార్, విజయ్ కుమార్ ల గుర్తించారు.