విజయవాడ, ఆగస్టు 19
2019 నవంబర్ 21న లోక్‍సభలో అమరావతి అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. గల్లా జయదేవ్‍కు మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా సమాధానం పంపింది.ఇండియా మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతి ఉంది. రాజధానిని అమరావతిగా చిత్రపటంలో చేర్చినట్లు సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. 2019 నవంబర్ 21న లోక్‍సభలో అమరావతి అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. గల్లా జయదేవ్‍కు మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా సమాధానం పంపింది. ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో పొందుపర్చినట్లు క్లారిటీ ఇచ్చింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్న వేళ అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించినట్లు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రం గతేడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ఇండియా మ్యాప్‌లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఇది ఏపీ ప్రజలను అవమానించడమేనన్న ఎంపీ.. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ అమరావతి విషయమై మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన కొత్త మ్యాప్‌ను కూడా ట్వీట్ చేశారు. మళ్లీ ఇప్పుడు గల్లా జయదేవ్‌కు సమాధానం ఇచ్చారు.