YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరింత దిగజారిన ప్రణబ్ ఆరోగ్యం

మరింత దిగజారిన ప్రణబ్ ఆరోగ్యం

న్యూడిల్లీ, ఆగస్టు 19 
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య మరింత క్షీణించినట్టు ఢిల్లీలో ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వెల్లడించింది. ఆయన ఊపిరితిత్తుల్లోకి ఇన్‌ఫెక్షన్ సోకినట్టు బుధవారం మధ్యాహ్నం తెలిపింది. ప్రణబ్ పరిస్థితి కొంచెం మెరుగుపడుతున్నట్టు ఆయన కుమారుడు అభిజీత్ ముఖర్జీ వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లో ఆస్పత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశాయి.‘ప్రణబ్ ముఖర్జీకి ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయనకు వెంటిలేటరపై చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం నిపుణుల బృందం పర్యవేక్షణలో వైద్యం నిర్వహిస్తున్నారు’ అని హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.మీ అందరి ప్రార్థనలు, వైద్యుల ప్రయత్నాలతో నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది.. అయన కీలక పారామీటర్స్ నియంత్రణలో ఉన్నాయి... పరిస్థితి మెరుగుదలకు సానుకూల సంకేతాలు గుర్తించబడ్డాయి.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని మీ అందరినీ కోరుతున్నాను’ అని అభిజీత్ ట్వీట్ చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అభిజీత్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.‘నాన్న చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు శనివారం వెళ్లి ఆయనను చూశాను.. ‘దేవుడి దయ, అందరి ప్రార్ధనలతో పరిస్థితి మెరుగుపడింది.. ఇంతకు ముందుకంటే స్థిరంగా ఉన్నారు.. చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారు! త్వరలోనే మన మధ్య తిరిగి వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో ఆదివారం పేర్కొన్నారు.  మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈనెల 10న ఆసుపత్రిలో చేరిన ప్రణబ్‌కు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆ మర్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రణబ్‌ కొవిడ్‌-19తో కూడా బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ఇప్పటి కూడా ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలియవచ్చింది.

Related Posts