YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రభుత్వ చేతగానితనానికి బలైన వరంగల్ :విజయశాంతి ధ్వజం

ప్రభుత్వ చేతగానితనానికి బలైన వరంగల్ :విజయశాంతి ధ్వజం

హైదరాబాద్ ఆగష్టు 19 
తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీచైర్‌పర్సన్, విజయశాంతి విమర్శించారు.ఇందుకు తాజా పరిణామాలే నిదర్శనమన్నారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైంది. ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోందన్నారు. తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ... కోవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యం. ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కోసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చు. ఇకనైనా మేలుకోండి.. పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలనివిజయశాంతి డిమాండ్ చేసారు.

Related Posts